Akhanda : బాక్సాఫీస్ రిపోర్ట్ : దంచికొడుతున్న “అఖండ” 5 రోజుల టోటల్ కలెక్షన్ ఎంతంటే!

Akhanda : ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్స్ గా నిలిచిన చిత్రాల్లో నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ ఏక్షన్ డ్రామా “అఖండ” కూడా చోటు సంపాదించుకుంది. అందరి అంచనాలను అందుకొని బాక్సఆఫోస్ దగ్గర దుమ్ము లేపుతుంది.

మరి ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ మాత్రం అన్ని చోట్ల నుంచి కూడా ఒకే రకంగా వస్తున్నాయి. ఇంకా ఆశ్చర్యకర విషయం ఏమిటంటే నిన్న సోమవారం వర్కింగ్ డే కి కూడా సాలిడ్ హోల్డ్ కనబర్చడం ట్రేడ్ పండితులకి షాక్ ఇస్తుంది. ఇక మన వరకు ఈ చిత్రం 5 రోజుల వసూళ్ల వివరాలు ప్రతి ఏరియా వైజ్ చూస్తే.

నైజాం – 13.43 కోట్లు, సీడెడ్ – 10 కోట్లు, ఉత్తరాంధ్ర – 4 కోట్లు, గుంటూరు – 3.5 కోట్లు, వెస్ట్ గోదావరి – 2.22 కోట్లు, తూర్పు గోదావరి – 2.78 కోట్లు, కృష్ణ – 2.48 కోట్లు, నెల్లూరు – 1.81 కోట్లుతో మొత్తం ఐదు రోజులకి గాను 40.22 కోట్లు షేర్ ని, 77.5 కోట్ల గ్రాస్ తో ఈ చిత్రం రాబట్టేసి బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. అలాగే మిగతా ఓవర్సీస్ వసూళ్లు వివరాలు తెలియాల్సి ఉంది.