మాసివ్ పోస్టర్ : రెండు భారీ అప్డేట్స్ తో బాలయ్య “అఖండ”.!

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మాస్ చిత్రం “అఖండ” నుంచి కూడా ఎట్టకేలకు కీలక అప్డేట్స్ వస్తున్నాయి. చిత్ర యూనిట్ సినిమా పూర్తయ్యాక పనులన్నీ వేగవంతం చేస్తున్నారు. ఇక ఈరోజు ఈ సినిమాపై బిగ్ అప్డేట్ ని నిర్మాతలు ద్వారకా క్రియేషన్స్ వారు రివీల్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు. అయితే దానిని ఇంకో గంట వాయిదా వేసినా రెండు భారీ అప్డేట్స్ ని అయితే వారు అందించారు. 
 
ఈ సినిమా నుంచి అదిరే ట్రైలర్ కట్ ని మాసివ్ పోస్టర్ తో వచ్చే నవంబర్ 14 న సాయంత్రం 7 గంటల 9 నిమిషాలు కు రిలీజ్ చేస్తుండగా మరోపక్క సినిమా రిలీజ్ డేట్ ని కూడా లాక్ చేసేసారు. దీనిని ఆ ట్రైలర్ తో అనౌన్స్ చెయ్యబోతున్నట్టు గా కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన గ్లామరస్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా బోయపాటి శ్రీను బాలయ్యతో హ్యాట్రిక్ ప్రాజెక్ట్ గా దీనిని తెరకెక్కించారు. అలాగే థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.