Akhanda : “అఖండ”తో ఆ నాలుగు దేశాల్లో రేర్ రికార్డు సెట్ చేసిన బాలయ్య.!

Akhanda : నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ “అఖండ”. తన హ్యాట్రిక్ దర్శకుడు బోయపాటి శ్రీను తో చేసిన ఈ చిత్రం వారిద్దరి కెరీర్ లోనే సంచలన విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ సినిమా విజయం మాత్రం మామూలు రేంజ్ ది కాదని చెప్పాలి కేవలం వసూళ్ల పరంగానే కాకుండా ఏకంగా కొన్ని రోజులు అలా అంటే వారాల తరబడి జనాన్ని థియేటర్స్ వైపుకి రప్పించి హౌస్ ఫుల్స్ తో రన్ అయ్యింది.

ఇది చాలా కాలం తర్వాత తెలుగు సినిమా దగ్గర నమోదైన ‘అఖండ’మైన విజయం. అయితే ఈ విజయం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే అనుకుంటే పొరపాటే బాలయ్య అఖండ సెన్సేషన్ విదేశాల్లో కూడా దుమ్ము లేపింది. యూఎస్ మార్కెట్ దగ్గర మాస్ సినిమాతో 1 మిలియన్ కొడితేనేమి..

ఇప్పుడు దానిని మించిన విజయాన్ని ఏకంగా నాలుగు దేశాల్లో అఖండ సెట్ చేయబోతుంది. అమెరికా, కెనడా, న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా దేశాల్లో 50 రోజులు రన్ పూర్తి చేసుకోబోతున్న తెలుగు సినిమాగా అఖండ రికార్డులకెక్కింది. ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత బాలయ్య సినిమాకి అని కాదు ఇండియన్ సినిమాకే దక్కిన ఘనత.

ఈరోజుల్లో గట్టిగా 25 రోజులు థియేటర్స్ లో సినిమా ఉంటేనే గొప్ప విషయం అలాంటిది 50 రోజులు విదేశీ గడ్డపై సినిమా ఆడింది అంటేనే అదెంత పెద్ద విజయాన్ని నమోదు చేసుకుందో అర్ధం చేసుకోవాలి. ఇక దీనికే ఇలా ఉంటే గత కొన్ని రోజులు కితమే దర్శకుడు బోయపాటి అఖండ కి సీక్వెల్ కూడా ఉందని అనౌన్స్ చేసాడు మరి దాని సెన్సేషన్ ఎలా ఉంటుందో చూడాలి.