Akhanda : దుమ్ము లేపిన “అఖండ” బాలయ్య కెరీర్ లోనే రికార్డు వసూళ్ల మార్క్ ఇది.!

Akhanda : నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం పేరు కూడా పరిచటం అక్కర్లేదు.. ఆ రేంజ్ లో తెలుగు రాష్ట్రాల్లో కాదు తెలుగు వాడు ఎక్కడ ఉన్నా కూడా భారీ హిట్ గా నిలిచి దుమ్ము లేపింది. ఇంకా గట్టిగా చెప్పాలి అంటే ఇప్పటి వరకు కూడా అఖండ వసూళ్ల ప్రవాహం తగ్గలేదు.

మధ్యలో కొన్ని సినిమాలు వచ్చినా నిలబడి చాలా చోట్ల హౌస్ ఫుల్ వసూళ్లతో దూసుకెళ్లింది. ఇక ఈ సంక్రాంతి రేస్ లో కూడా అఖండ చిత్రం హవా చూపించినట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి ఈ పండుగ రోజుల్లో కూడా అదరగొట్టిన ఈ చిత్రం బాలయ్య కెరీర్ లోనే భారీ అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచిందట.

అయితే ఈ సినిమా ఫస్ట్ టైం ఏకంగా 150 కోట్ల మార్క్ ని అతి త్వరలో అందుకొని సెన్సేషన్ ని నమోదు చేయనుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దీనితో బాలయ్య మరియు బోయపాటి శ్రీనుల హ్యాట్రిక్ చిత్రం ఎంతటి హిట్ అయ్యిందో మనం అర్ధం చేసుకోవాలి.

ఇక ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే నిర్మాత మిర్యాల రవీంద్ర రెడ్డి ట్రిపుల్ ప్రాఫిట్స్ ను అందుకున్నారు.