నేను తలచుకుంటే నాన్న నాతోనే ఆ సినిమా తీసేవాడు.. కానీ నాకు ఆ స్థాయి లేదు…!

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ఇటీవల ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా కూడా మంచి హిట్ అయ్యింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ లైగర్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీ కుడా హీరోగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆకాష్ ఆంధ్ర పోరి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

ఆకాష్ ఇటీవల జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చోర్ బజార్ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకుని ఈ నెల 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో భారీగా సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆకాష్ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ సందర్భంగా ఆకాష్ మాట్లాడుతూ..
నేపోటిజం గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. నెపోకిడ్ ని మహా అయితే హీరోగా ఇండస్ట్రీలో లంచ్ చేయగలరు అంతే కానీ.. వారికి సక్సెస్ ఇచ్చి స్టార్స్ ని చేయలేరనీ ఆకాశ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

స్టార్ సెలబ్రిటీల పిల్లలు అయినంత మాత్రాన అందరూ సక్సెస్ కాలేరు. కెరీర్ లో సక్సెస్ అవ్వాలంటే టాలెంట్ ఉండాలి అంటూ ఆకాష్ చెప్పుకొచ్చాడు. అందరూ నన్ను ఎప్పుడు ఒక ప్రశ్న అడుగుతుంటారు.. నువ్వు మీ నాన్నతో కాకుండా ఇతర డైరెక్టర్లతో సినిమాలు చేయటానికి కారణం ఎంటి అని.ఒకవేళ నేను నెపోటిజాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఉంటే.. లైగర్ సినిమా నాతోనే తియ్యి అని నాన్న ని అడిగేవాడిని. నేను అడిగితే నాన్న నాతో సినిమా చేయటానికి నాన్న కాదనరు. కానీ నేను కష్టపడి నాన్న స్థాయికి వచ్చినప్పుడు నాన్న తో కలిసి సినిమా చేస్తా. అప్పటిదాకా నేను నాన్నతో సినిమా చేయను.అంటూ ఆకాష్ చెప్పుకొచ్చాడు. నేపోటిజం గురించి ఆకాష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.