‘ఐశ్వర్యా ఛాలెంజ్‌’ చేస్తోంది!?

Aishwarya Rajesh

టాలీవుడ్ లో ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘కౌసల్య కృష్ణ మూర్తి ‘వంటి  చిత్రాలతో న‌టిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో న‌టించిన చిత్రం ‘ఐశ్వర్యా ఛాలెంజ్‌’. ఇందులో నిజంగానే తన పాత్ర ద్వారా  ఛాలెంజ్‌ చేస్తానంటోంది.

Aishwarya Rajesh
Aishwarya Rajesh

ఒకప్పుడు అందరూ తనను సినిమాకి పనిరావు అన్నారట. అలాంటి వారికి తన గత రెండు చిత్రాలే సరైన సమాధానం చెప్పాయంటోంది. త్వరలోనే రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌లో జాయిన్ అవుతున్న ఐశ్వర్య రాజేష్ నటించిన  ఈ సినిమాని పూర్తిగా మలేసియాలో రూపొందించారు. దీపావళి కానుకగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది.

ఈ చిత్రంలో అభినయ్‌, సుమన్ శెట్టి తదితరులు కీల‌క పాత్ర‌ల‌లో నటించారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఐశ్వర్యా ఛాలెంజ్`ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కి మంచి స్పందన వ‌చ్చింది. దీపావ‌ళి కానుక‌గా రామ్‌గోపాల్ వ‌ర్మ  బ్లెస్సింగ్ తో డిజిట‌ల్ మాధ్య‌మంలో విడుద‌ల చేశారు.  

ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమాని త్వరలో థియేటర్ లో విడుదల కానుంది. అలాగే `ఆహా ‘,’ ఊర్వశి ‘ఓటీటీ  ద్వారా కూడా రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణ డా. పద్మ శ్రీ. కూటికుప్పల సూర్యారావు, నిర్మాతః తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, దర్శకత్వంః సూర్య నిధి.