RRR Movie Team : “RRR” బ్లాస్ట్..మళ్ళీ అసలు పని మొదలు పెట్టేసారుగా.!

RRR Movie Team : ఇప్పుడు టాలీవుడ్ నుంచి రాబోతున్న భారీ చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. తారా స్థాయి అంచనాలు ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అంతా చూస్తుండగా మేకర్స్ ఒక కొత్త డేట్ ని ఇంకా ముందే ప్రకటించి సెన్సేషన్ ని నమోదు చేశారు.

ఇక మళ్ళీ సినిమాని రిలీజ్ కి రెడీ చేస్తుండడంతో చిత్ర బృందం ముఖ్యంగా సోషల్ మీడియా విభాగం మళ్ళీ ఆక్టివ్ అవ్వడం జరిగింది. ఈరోజు నుంచి సరిగ్గా ఈ భారీ సినిమా రిలీజ్ కి 50 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఈ 50 రోజులు సందర్భంగా ఒక బ్లాస్టింగ్ వర్కింగ్ స్టిల్ ని చిత్ర యూనిట్ ఇప్పుడు రిలీజ్ చెయ్యగా దానికి భారీ రెస్పాన్స్ వస్తుంది.

ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు రోడ్ పై ఒకరు బైక్ పై ఇంకొకరు గుర్రంపై అగ్రెసివ్ గా స్వారీ చేస్తున్న పవర్ ఫుల్ సన్నివేశాన్ని చిత్రీకరించిన ఫోటో ని రిలీజ్ చేశారు. ఇది మాత్రం వేరే లెవెల్లో ఉందని చెప్పాలి.

ఇక ఇక్కడ నుంచి మళ్ళీ ఈ భారీ సినిమా నుంచి ఎప్పటికపుడు అలర్ట్స్ స్టార్ట్ అయ్యినట్టే అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో ఆలియా భట్, అజయ్ దేవగన్ మరియు శ్రేయ సహా తదితరులు కీలక పాత్రల్లో నటించగా వచ్చే మార్చ్ 25న ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ కానుంది.