Ram Gopal Varma : వైరల్ : మళ్ళీ అల్లు వర్సెస్ మెగా చిచ్చు పెడుతున్న రామ్ గోపాల్ వర్మ.!

Ram Gopal Varma : వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో చేసే రచ్చ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ముఖ్యంగా టాలీవుడ్ లో అయితే మెగా హీరోలకి అనుకూలంగా ఉన్నట్టు మాట్లాడుతూనే చెయ్యాల్సింది అంతా చేస్తుంటాడు. వారి ఫ్యామిలీ అంతా బాగానే ఉన్నా ఈయన మాత్రం ఎప్పుడూ ఏదొక చిచ్చు పెడుతూ ఎవరొకరిని కెలుకుతూనే ఉంటాడు.
మరి అలా ఆ మధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి “పుష్ప” తో భారీ క్రేజ్ రాగా అక్కడ నుంచి అల్లు అర్జున్ ని నువ్వే నెక్స్ట్ మెగాస్టార్ అంటూ ఓ రేంజ్ లో ఎత్తేసాడు.
దీనితో అక్కడ నుంచే అల్లు అభిమానులని మరియు మెగా ఫ్యాన్స్ కి మధ్యలో గొడవ పెట్టె అంత పని చేసాడు.
అయితే ఇపుడు మళ్ళీ అదే తరహాలో లేటెస్ట్ గా “ఆచార్య” సినిమా నుంచి చిత్ర యూనిట్ ఒక వీడియో రిలీజ్ చెయ్యగా అందులో రామ్ చరణ్ మరియు మెగాస్టార్ చిరంజీవిలు “తగ్గు తగ్గను” అంటూ మాట్లాడ్డం ఆసక్తిగా మారింది.
అలాగే ఈ మాటలు పుష్ప లోని “తగ్గేదేలే” అనే డైలాగ్ కి కూడా దగ్గరగా ఉండడంతో దీనిపై పెట్టాడు వర్మ పోస్టు..
నేను ఒక మెగా అభిమానిని అని అలాంటిది మీరే ఇప్పుడు తగ్గు తగ్గను అని అల్లు అర్జున్ తరహాలో చెప్తూ ఇన్ డైరెక్ట్ గా అల్లు అర్జున్ నే నెక్స్ట్ “మెగా” అని చెబుతున్నారని రామ్ చరణ్ చిరంజీవిలు చెబుతున్నారని అంటున్నాడు. దీనితో మళ్ళీ క్లియర్ కట్ గా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని అందరికీ అర్ధం అయ్యిపోయింది.
ఆ మధ్య అల్లు ఫ్యామిలీ పై ఏదో సినిమా తీస్తా అని కూడా అనౌన్స్ చేసాడు మరి అదేమి అయ్యిందో అతనికే తెలియాలి.
https://twitter.com/RGVzoomin/status/1515348400987725830?s=20&t=i58p4JUV-Zs-CXaCUwB6Uw