MAA Election : తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర అసలు ఏ ఏడాదిలో కూడా జరగని విధంగా “మా” ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. రికార్డు స్థాయి వోటింగ్ నమోదు తో ప్రధాన పోటీదారులుగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ అలాగే హీరో మంచు మనోజ్ లు వారి ప్యానల్ లతో పోటీకి దిగగా ఎవ్వరు ఊహించని రీతిలో మంచు విష్ణు ఈ ఎన్నికల్లో విజయం సాధించి ప్రెసిడెంట్ గా ఎన్నిక అయ్యాడు.
అయితే ఇక అక్కడ నుంచి అసలు రచ్చ మొదలు అయ్యింది. ఈ ఎన్నికలు సరిగా జరగలేదు అని వోటింగ్ లో అవకతవకలు జరిగాయని చాలా అభ్యంతరాలు వ్యక్తం చేసారు. పైగా ముందు రోజు గెలిచిన వారు తర్వాత ఓటమి పాలు అయ్యారని ప్రకటనలు ఇవ్వడంతో ప్రకాష్ రాజ్ ప్యానల్ వారు కూడా మరింత ఆగ్రహంతో రాజీనామాలు కూడా చేసేసారు.
అలా అనేక రోజులు నడిచిన ఈ రచ్చ కొనసాగుతూనే.. ప్రెసిండెంట్ గా విష్ణు తన మట్టుకు తాను ప్రమాణ స్వీకారం చేసేసుకొని తనకి తానే ప్రకటించుకున్నట్టు చేసాడు. ఇక ఇప్పుడు మళ్ళీ ఈ రగడ తెరపైకి వచ్చింది. ఈసారి బ్రేక్ సమాచారం ఏమిటంటే అప్పుడు ప్రకాష్ రాజ్ ప్యానల్ అంతా ఇచ్చిన రాజీనామాలు ప్రెసిడెంట్ ఇప్పుడు ఆమోదం తెలిపాడు అట.
అంతే కాకుండా దాదాపు నెలపాటు మళ్ళీ వారి అందరిని వెనక్కి తెచ్చే ప్రయత్నం చేసినా ఎవరు రాలేదట. మొత్తానికి ప్రకాష్ రాజ్ ప్యానల్ వారు అధికారికంగా తప్పుకున్నట్టే చెప్పాలి.