Pushpa : తగ్గని ‘పుష్ప’ క్రేజ్..అద్భుత దృశ్యంతో వైరల్ అవుతున్న జడ్డు భాయ్.!

Pushpa : రీసెంట్ గా టాలీవుడ్ సినిమా దగ్గర వచ్చిన భారీ బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “పుష్ప” కూడా ఒకటి. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమా వీరి కెరీర్ లో హ్యాట్రిక్ సినిమాగా వచ్చి మంచి హిట్ గా నిలిచింది.

అయితే ఈ సినిమాలో ముఖ్యంగా అల్లు అర్జున్ పాత్రకి ఎంత అప్రిషియేషన్ వచ్చిందో తెలిసిందే. బాలీవుడ్ నుంచి ఇండియన్ స్టార్ క్రికెటర్స్ సైతం “తగ్గదేలే” అన్నారు. ఆ రేంజ్ లో పుష్ప రాజ్ పాత్ర ఇంపాక్ట్ ని కలిగించింది. మరి వీరిలో స్టార్ క్రికెటర్ జడ్డు భాయ్ జడేజా మళ్ళీ వైరల్ అవుతున్నాడు.

ఆ మధ్య ఇంస్టాగ్రమ్ రీల్ లో నియవ్వ తగ్గేదేలే అంటూ హడావుడి చేసి మళ్ళీ నిన్న జరిగినటువంటి శ్రీలంక తో 20 మాచ్ లో తన తొలి వికెట్ తీసుకున్నాక గడ్డం నుంచి చేయి పోనిచ్చి తగ్గేదేలే అంటూ సింబాలిక్ గా చెప్పడంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీనితో క్రికెట్ వర్గాలు సహా సినీ వర్గాల్లో ఈ విజువల్ ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

ఇక ఈ సినిమాలో బన్నీ సరసన రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా అనసూయ, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు.