మళ్ళీ మాస్ అవతార్ లో అల్లు అర్జున్..కాంబో సెట్టయ్యింది!

Allu Arjun Boyapati Teaming Again | Telugu Rajyam

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ప్రతీ సినిమాకి కూడా ఎన్ని వేరియేషన్స్ చూపిస్తూ వస్తాడో అందరికీ తెలిసిందే. అలా ఇప్పుడు పుష్ప లో కంప్లీట్ మాస్ రోల్ లో కనిపించబోతున్నాడు. అయితే అల్లు అర్జున్ క్రేజ్ కంప్లీట్ గా మాస్ లో పెంచిన మొదటి సినిమా “సరైనోడు”.

మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రమే అల్లు అర్జున్ ని మాస్ ఆడియెన్స్ కి మరింత దగ్గర చేసింది. అయితే మళ్ళీ ఈ ఇద్దరుతో సినిమా ఉన్నట్టుగా నిర్మాత అల్లు అరవింద్ నిన్న కంఫర్మ్ చేసేయడం హాట్ టాపిక్ గా మారింది.

గత కొన్నాళ్లుగా ఈ సినిమా ఉంటుందని టాక్ ఉండగా నిన్న బాలయ్య తో ప్లాన్ చేసిన “అన్ స్టాప్పబుల్” ఓటిటి షో లాంచ్ లో తన అఖండ సినిమా కోసం ఎదురు చూస్తున్నానని అలాగే బోయపాటితో మళ్ళీ అల్లు అర్జున్ సినిమా కూడా చేయబోతున్నామని క్లారిటీ ఇచ్చేసారు.

దీనితో ఈ మాస్ కాంబినేషన్ నుంచి రెండో భారీ సినిమా కన్ఫర్మ్ అయ్యిపోయింది ఇక ఈ సారి బన్నీని బోయ ఎలాంటి మాస్ అవతార్ లో చూపిస్తాడో చూడాలి.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles