తప్పదు..మరోసారి డిజాస్టర్ కి రెడీ అయ్యిన “ఆచార్య”.!

Acharya

ఈ ఏడాది టాలీవుడ్ దగ్గర రిలీజ్ అయ్యినటువంటి చిత్రాల్లో ఎక్కువ మల్టీ స్టారర్స్ రాగ ఆ చిత్రాల్లో అయితే మెగా మల్టీ స్టారర్ చిత్రం “ఆచార్య” కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి అలాగే తన కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాని తెరకెక్కించారు.

మరి భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్ దగ్గర ఓ భారీ ప్లాప్ గా నిలిచింది. దీనితో భారీ నష్టాలు అందుకొని ఎపిక్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక అక్కడ నుంచి నష్టాల విషయంలో పెద్ద డ్రామా కూడా నడవడం అలా చాలానే జరిగాయి.

వీటితో పాటుగా ఈ సినిమా సాటిలైట్ హక్కులు సొంతం చేసుకున్న జెమినీ టీవీ వారు సినిమాలో కాజల్ లేదని మళ్ళీ సగం డబ్బులు వెనక్కి అడగడం ఇలా చాలానే జరిగాయి. అయితే మరి ఫైనల్ గా మళ్ళీ డిజాస్టర్ కావడానికి ఆచార్య అయితే సిద్ధం అయింది.

ఈ చిత్రం జెమినీ ఛానెల్లో అయితే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా మొదటి టెలికాస్ట్ కి రెడీ అయ్యింది. ఈ అక్టోబర్ 23న ఈ చిత్రం సాయంత్రం టెలికాస్ట్ కానున్నట్టు ఫిక్స్ అయ్యింది. అయితే ఈ సినిమా అసలు వచ్చే ఛాన్స్ లేదు అనుకున్నారు కానీ ఫైనల్ గా తీసుకొస్తున్నారు.

మరి టీవీ దగ్గర అయ్యితే మినిమమ్ 5 రేటింగ్ వచ్చినా కూడా దీనికి చాలా ఎక్కువే అని చెప్పాలి. మరి ఆరోజు ఏమవుతుందో చూడాలి.