KGF 2 :”కేజీఎఫ్ 2″ చూసాక అతడికి వెంటనే కాల్ చేసిన సూపర్ స్టార్ రజినీకాంత్.!

 KGF 2 : లేటెస్ట్ శాండిల్ వుడ్ సెన్సేషన్ చిత్రం “కేజీఎఫ్ చాప్టర్ 2” కోసం అందరికీ తెలిసిందే. రాకింగ్ స్టార్ యష్ బాస్ తెరకెక్కించిన ఈ సినిమా యష్ కెరీర్ లోనే కాకుండా ఇండియన్ సినిమా దగ్గరే ఒక భారీ ఏక్షన్ డ్రామాగా వచ్చింది.
మరి ఇలా రావడంతోనే ఇండియన్ సినిమా దగ్గర అనేక చోట్ల భారీ మార్జిన్ తో వసూళ్లు కొల్లగొట్టింది.
దీనితో రెండో రోజు కూడా అదిరే వసూళ్లను అందుకుంటున్న ఈ సినిమా ని తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా చూశారట.
దీనితో ఈ టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ గా మారింది. మరి ఈ సినిమా చూసి తనకి విపరీతంగా నచ్చడంతో ఈ సినిమాకి నిర్మాత అయినటువంటి విజయ్ కిరగందూర్ కి వెంటనే కాల్ చేసి సినిమా చాలా బాగా వచ్చిందని కంగ్రాట్స్ తెలిపారట.
దీనితో ఇదే మాట కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా ప్రకాష్ రారాజే, సంజయ్ దత్ మారియు రావు రమేష్ ఇంకా రవీనా లు కీలక పాత్రల్లో నటించారు.
అలాగే రవి బాసృర్ సంగీతం అందించాడు. ఇదిలా ఉండగా రజినీ నెక్స్ట్ బీస్ట్ సినిమా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నారు.