KGF Chapter 2 :చరిత్ర సృష్టించిన “కేజీఎఫ్ 2”!

After RRR Movie KGF Chapter 2 : భారత దేశ సినిమా ఇప్పుడు సరికొత్త పుంతలు తొక్కుతుంది. ఒక సరైన సినిమా గాని పడితే దాని ఫలితం ఎలా ఉంటుందో మన దక్షిణాది సినిమాలు చూపిస్తున్నాయి. మరి వాటిలో ఆల్ మోస్ట్ మన తెలుగు సినిమాలే ఉండగా లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో మొట్ట మొదటి సారిగా కన్నడ సినిమా కూడా చేరింది.
శాండిల్ వుడ్ లో రాకింగ్ హీరో యష్ నటించిన తాజా చిత్రం “కేజీఎఫ్ చాప్టర్ 2” ఎన్నో అంచనాలు నడుమ రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ గా నిలబడింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ చూపించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మాస్ వర్క్ కి ఇండియన్ బాక్సాఫీస్ గులాం అయ్యిపోయింది.
దీనితో రికార్డు ఓపెనింగ్స్ ఫాస్టెస్ట్ వసూళ్లు కొల్లగొట్టిన ఈ సినిమా ఇప్పుడు ఏకంగా 1000 కోట్ల గ్రాస్ ను టచ్ చేసి ఇండియన్ సినిమా దగ్గర చరిత్ర సృష్టించింది. గత కొన్ని రోజులు కితమే మన తెలుగు సినిమా ట్రిపుల్ ఆర్(RRR) ఈ మార్క్ ని అందుకొని 1100 కోట్లకి పైగా వసూళ్లతో ఇప్పటికీ మంచి రన్ ని కొనసాగిస్తూ వెళ్తుండగా ఈ లిస్ట్ లో ఇప్పుడు కేజీఎఫ్ 2 కూడా చేరిపోయింది.
మరి ఈ మార్క్ నిన్నటి వసూళ్లతో అందుకున్నట్టుగా ట్రేడ్ వర్గాల వారు ఇప్పుడు చెబుతున్నారు. మొత్తానికి అయితే ఒక కన్నడ సినిమా ఫస్ట్ టైం ఇలాంటి ఒక రికార్డును అందుకోవడంతో ఆ రాష్ట్ర ప్రజలు కూడా సంతోషంగా భావిస్తున్నారు.