Samantha: మరొక ఐటెంసాంగ్ కు గ్రీన్ సిగ్నలిచ్చిన సమంత!

Samantha: టాలీవుడ్ బ్యూటీ సమంత,నాగ చైతన్య తో విడాకుల తర్వాత తన రూటు మార్చేసింది. వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్,బాలీవుడ్,హాలీవుడ్ ఇండస్ట్రీ లో నుంచి మంచి మంచి సినిమా అవకాశాలు అందుకుంటోంది. ఇక ఇప్పటికే ఎన్నో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సమంత. అయితే విడాకులు తరువాత సమంత పెళ్లి ముగిసిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ విడాకుల తర్వాత సమంత కెరీర్ పై దృష్టి పెట్టి రెట్టింపు ఉత్సాహంతో దూసుకుపోతోంది. ఇకపోతే ఇటీవలే అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాలో సమంతా స్పెషల్ సాంగు చేసిన విషయం అందరికి తెలిసిందే.

సమంత చేసిన సాంగ్ సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో రికార్డులు సృష్టించడమే కాకుండా సమంతకు మరింత పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా సమంతకు మరొక పాన్ ఇండియా సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. అందుకు సమంతా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అని ప్రచారాలు జరుగుతున్నాయి. పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటమ్ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఈ పాట విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ చూసినా కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పాటను పాడటం ఆ పాటలకు స్టెప్పులు వేయడం లాంటివి చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే పాటలోని స్టెప్పులను రీ క్రియేట్ చేస్తూ కొన్ని లక్షల వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే.

ఈ సినిమా రిలీజ్ అయ్యి నెల రోజులు దాటినా కూడా ఈ సినిమా క్రేజ్ తగ్గలేదు. ఇప్పటి వరకూ సమంత చేసిన సాంగ్ యూట్యూబ్ లో 73 మిలియన్ల వ్యూస్ నీ సొంతం చేసుకుంది. పుష్ప సినిమా అంతటీ విజయాన్ని సాధించడంలో ఈ పాట కూడా ఒక కీలక పాత్ర పోషించింది అని చెప్పవచ్చు. అయితే ఇది క్రేజ్ ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా వాడుకోవాలని చూస్తున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం సమంత అయితే బాగుంటుంది అనీ అనుకున్నారట. ఈ విషయంపై చిత్ర బృందం సమంతతో సంప్రదింపులు జరగా సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.