షాకింగ్ : నాగబాబు తర్వాత ప్రకాష్ రాజ్ సంచలన నిర్ణయం..!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నడూ లేని విధంగా నిన్న “మా” ఎన్నికలు జరిగాయి. అసలు హిస్టరిలోనే ఎప్పుడు లేని విధంగా భారీ ఓటింగ్ నమోదు అయ్యింది. అయితే ఈ ఓటింగ్ తో పోటీ మరింత రసవత్తరంగా మారగా గ్రౌండ్ లో అయితే అంతా కూడా ప్రకాష్ రాజ్ నే గెలుస్తారు అనుకున్నారు కాని అనూహ్యంగా ఈ మా ప్రెసిడెంట్ పదవిని మంచు విష్ణు తన్నుకుపోవడం ప్రతీ ఒక్కరినీ స్టన్ చేసింది..

దీనితో ఎన్నికల విషయంలో బాగా హర్ట్ అయ్యిన నాగబాబు తన మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని సంచలన ప్రకటన చెయ్యగా ఇప్పుడు ప్రధాన పోటీదారు ప్రకాష్ రాజ్ కూడా టాలీవుడ్ లో తన మా సభ్యత్వానికి రాజీనామా చేయడం మరో సంచలనంగా మారింది.

దీనితో సోషల్ మీడియాలో మరోసారి రచ్చ స్టార్ట్ అయ్యింది. మరి ఇలా మొదలైన ఈ రాజీనామా పర్వం ఇంకెక్కడ ఆగుతుందో చూడాలి. ఫైనల్ గా మాత్రం ఈ ఎన్నికల విషయంలో నాగబాబు ప్రకాష్ రాజ్ లు బాగా హర్ట్ అయ్యారనే చెప్పాలి.