సమంత నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని కారణాల వల్ల విడాకులతో విడిపోయారు. అయితే వీరి విడాకుల గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలా విరివిడాకులు గురించి ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టినప్పటికీ సరైన కారణం మాత్రం తెలియడం లేదు. ఎప్పటికైనా ఈ విషయం గురించి ఇద్దరిలో ఎవరో ఒకరు చెప్పకపోతారా అని అభిమానులు ఎదురు చూశారు. అయితే ఆ సమయం రానే వచ్చిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సమంత బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొనబోతున్నారు.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది సెలెబ్రెటీలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే సమంత బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తో కలిసి వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా కరణ్ జోహార్ సమంతను ప్రశ్నిస్తూ..అన్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్`కి కారణమేంటని ప్రశ్నించగా, సమంత ఇరిటేట్ అవుతూ తన మ్యారేజ్ లైఫ్ లో సంతోషంగా లేకపోవడానికి కారణం మీరేనని కరణ్ జోహార్ ను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పెళ్లి లైఫ్ `కభీ ఖుషీ కభీ ఘమ్`లో ఎంతో బాగా చూపించారు. పెడి లైఫ్ అలాగే ఉంటుందని భావించాను కానీ పెళ్లి చేసుకున్న తర్వాత జీవితం పెళ్లి లైఫ్ `కభీ ఖుషీ కభీ ఘమ్`లో మాదిరి కాకుండా కేజిఎఫ్ సినిమాలో ఉంది అంటూ ఈమె తన వైవాహిక జీవితంలో సంతోషంగా లేను అనే విషయాన్ని తెలియజేశారు. మొత్తానికి సమంత పెళ్లి తర్వాత కే జి ఎఫ్ సినిమాలో హీరోయిన్ పడే బాధలు పడిందని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇకపోతే ప్రస్తుతం సమంత పెళ్లి జీవితం గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఈ ప్రోమో వైరల్ గా మారింది. ఇక ఈ కార్యక్రమం జూన్ 7వ తేదీ నుంచి ప్రసారం కానుంది మరి పూర్తి ఎపిసోడ్లో సమంత ఎలాంటి తన విడాకుల గురించి వ్యాఖ్యలు చేయనుందో తెలియాల్సి ఉంది.