వైరల్ : బాలయ్య, చిరు ల తర్వాత పవన్ కి కూడా అదే సమస్య.!

ఇటీవలే మన టాలీవుడ్ అగ్ర హీరోలు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి అలాగే నందమూరి బాలకృష్ణ లు ఒకే సమస్య తో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు స్టార్ హీరోలు కూడా తమ చేతులకి ఒక కీలక సర్జరీ ని చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చేరేలా ఉన్నట్టు అనిపిస్తుంది. తాను లేటెస్ట్ గా చేస్తున్న మాస్ సినిమా “భీమ్లా నాయక్” లో గాయ పడ్డాడో ఏమో కాని తాను కూడా చేతికి కట్టు తో కనిపించడం ఇప్పుడు వైరల్ అవుతుంది.

దీనితో పవన్ అభిమానులు కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా మన స్టార్ హీరోలు ఒకరి తర్వాత ఇంకొకరు ఇదే సమస్య తో బాధ పడుతుండడం విచారకరం. మరి ఇంకా పవన్ కి కూడా సర్జరీ పడుతుందా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం పవన్ భీమ్లా నాయక్ నుంచి రానున్న మాస్ నెంబర్ కోసం అయితే అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.