Allu Arjun : బాలీవుడ్ స్టార్ తర్వాత అల్లు అర్జున్ కే దక్కిన ఈ రికార్డ్.!

Allu Arjun : ఇప్పుడు పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకొని సాలిడ్ వసూళ్ళ ను రాబడుతున్న ఏకైక సినిమా “పుష్ప పార్ట్ 1”. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా ఇది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ అయ్యాక తెలుగుతో పాటు సమానమైన హిట్ గా నిలిచింది హిందీలో అని చెప్పాలి. అక్కడ పుష్ప కనబరుస్తున్న నిలకడ మాములుగా లేదు.

ఇంకా అక్కడ బాలీవుడ్ స్టార్ హీరో తర్వాత ఆ రేంజ్ లో పుష్ప సినిమాకి జనం తరలి వస్తున్నారట. అక్కడి స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్టార్డం కోసం అందరికీ తెలిసిందే. అక్షయ్ రీసెంట్ గా నటించిన మల్టీస్టారర్ చిత్రం “సూర్య వంశీ” చిత్రం మాత్రం హిందీలో థియేటర్స్ కి 25 లక్షల మందిని తీసుకొచ్చిందట. అలా మళ్లీ ఈ ఏడాది కి గాను 25 లక్షల మందిని దాటి ఆడియెన్స్ ని రాబట్టింది పుష్ప సినిమా అట.

అంటే ఈ లెక్కన పుష్ప సినిమా హిందీలో ఎంత పెద్ద హిట్టో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ భారీ సినిమాలో అనసూయ, సునీల్ మరియు ఫహాద్ ఫాజిల్ తదితరులు నటించగా పార్ట్ 2 వచ్చే ఏడాది మార్చ్ నుంచి స్టార్ట్ చేయనున్నారు.