హాట్ టాపిక్ : “పుష్ప” బాటలో “కేజీఎఫ్” స్టార్

After Allu Arjun KGF Star Yash : ఏ హీరోకి అయినా కూడా తమకి వచ్చిన స్టార్డం ని ఎలా వినియోగించుకున్నారు అనేది కూడా చాలా కీలకం అని చెప్పాలి. ఓ సినిమాతో అపారమైన క్రేజ్ రావొచ్చు కానీ తర్వాత వారు తీసుకునే ఏ చిన్న మిస్టేక్ అయినా కూడా అప్పటివరకు వారికి వచ్చిన భారీ క్రేజ్ ని యిట్టె కూలదోస్తుంది.
అందుకే కొందరు స్టార్స్ మాత్రం ఏది ఏమైనప్పటికీ తమ హద్దులు దాటరు. మరి అలానే పాన్ ఇండియా సినిమా దగ్గర తమ క్రేజీ ప్రాజెక్ట్ లతో భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న మన స్టార్ హీరోలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు లేటెస్ట్ గా కేజిఎఫ్ హీరో యష్ లు ఒకరు. మరి పుష్ప తో అల్లు అర్జున్ కి భారీ క్రేజ్ రాగా తన రీచ్ సాలిడ్ గా పెరిగిపోయింది.
దీనితో అల్లు అర్జున్ ఆ క్రేజ్ ని తప్పుగా కాకుండా మంచిగా యూజ్ చేసే ప్రయత్నం చేసాడు. అందులో భాగంగానే తనకి ఓ ప్రముఖ పొగాకు సంస్థ నుంచి క్రేజీ ఆఫర్స్ ఇవ్వగా తన అభిమానులు ప్రేక్షకుల ఆరోగ్యాల దృష్ట్యా వదిలేసుకున్నాడు.
మరి ఇప్పుడు కేజీఎఫ్ తర్వాత హీరో యష్ కి కూడా పాన్ ఇండియా స్థాయిలో ఎనలేని ఆదరణ రావడంతో అలాంటి ఒక ఇలాచీ సంస్థ యష్ దగ్గరకి కాస్త ఎక్కువ మొత్తంలోనే కోట్లతో వచ్చారట. కానీ దానికి యష్ చెయ్యనని చెప్పాడట. దీనితో ఇదే సోషల్ మీడియా మరియు సినీ వర్గాల్లో మంచి హాట్ టాపిక్ గా మారిపోయింది.