Acharya Release : ఇన్సైడ్ టాక్ : “ఆచార్య” రిలీజ్ అయ్యాక అతడి కోసం ప్రత్యేకంగా చెప్పుకుంటారా?

Acharya Release : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నేళ్లు అయినా కూడా ఒకటే క్రేజ్ మరియు బాక్సాఫీస్ స్టామినాతో నిలబడ్డ ఏకైక స్టార్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది మెగాస్టార్ చిరంజీవే అని చెప్పడంలో స్సందేహమే లేదు.
మై మెగాస్టార్ మాస్ హంగామా ని థియేటర్స్ లో చూసి చాలా కాలమే అయ్యింది.
దీనితో ఇప్పుడు అంతా తన మోస్ట్ అవైటింగ్ సినిమా “ఆచార్య” రిలీజ్ కోసం చూస్తున్నారు. మరి ఫైనల్ గా ఈ సినిమా రిలీజ్ కి జస్ట్ కొన్ని రోజులు మిగిలి ఉండగా ఈ సినిమా ఎలా ఉంటుందో అని అందరిలో ఆసక్తిగా మారింది.
అయితే ఈ చిత్రంలో బయటకి కనిపించే ఎన్నో హంగులు హీరోలు దర్శకులు ఉన్నారు కానీ..
సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం ఓ వ్యక్తి కోసం డెఫినెట్ గా ఇండస్ట్రీ వర్గాలు వారు ఆడియెన్స్ మాట్లాడుకుంటారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. మరి ఆ వ్యక్తి ఎవరో కాదట ఈ సినిమా ఛాయాగ్రాహకుడు తిఱు అట.
ఆయన ఈ సినిమాకి స్టన్నింగ్ సినిమాటోగ్రఫీ అందించారని చిత్ర యూనిట్ కూడా ఆయన తీసిన విజువల్స్ మరియు పనితనంతో ఎంతో ఆనందం వ్యక్తం చేశారట. అందుకే సినిమా రిలీజ్ అయ్యాక ఆడియెన్స్ కూడా చాలా థ్రిల్ అవ్వడం ఖాయం అని అంటున్నారు.
మరి ఈ వర్క్ ఎలా ఉందో తెలియాలి అంటే ఈ 29 వరకు ఆగక తప్పదు.