Acharya Release : ఇన్సైడ్ టాక్ : “ఆచార్య” విషయంలో మెగాస్టార్ వేసుకున్న ప్లాన్ అట్టర్ ప్లాప్ అయ్యిందా??

Acharya Release : ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రాబోతున్న పలు క్రేజీ మల్టీస్టారర్ చిత్రాల్లో బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం “ఆచార్య” కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇలా ఇద్దరు తండ్రి కొడుకులతో చేసిన భారీ బడ్జెట్ మల్టీస్టారర్ ఇది. ఈ సినిమాని చిత్ర బృందం అలాగే మెగాస్టార్ మంచి ప్లానింగ్ తో ప్లాన్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఆల్రెడి ఫిబ్రవరి లో రిలీజ్ కి రెడీగా కూడా ఉంది. అయితే ఈ సినిమా విషయంలో మెగాస్టార్ చేసుకున్న ఒక ప్లాన్ ఇప్పుడు అట్టర్ ప్లాప్ అయ్యిందా అని చెప్పాలి. నిజానికి ఈ సినిమా కన్నా ముందు బారీ పాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్(RRR) రిలీజ్ కావల్సి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదెలాగో పాన్ ఇండియా సూపర్ హిట్ అవుతుంది అని గ్రహించిన చిరు ఎలాగో తన సినిమాలో కూడా రామ్ చరణ్ చాలా బలమైన పాత్రని పోషించాడు కాబట్టి నెమ్మదిగా ఆచార్య ని కూడా హిందీలో రిలీజ్ చేసేయ్యాలని ప్లాన్ చేసినట్టు ఊహాగానాలు వినిపించాయి.

కానీ ఇప్పుడు మొత్తం సీన్ మారిపోవడంతో చిరు వేసుకున్న ప్లాన్ ప్లాప్ అయ్యినట్టు అయ్యింది. అయితే ట్రిపుల్ ఆర్ సినిమా ఇప్పుడప్పుడే వచ్చేలా లేదు. దీంతో ఆచార్య సినిమానే ముందే విడుదల అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనితో చిరు అనుకున్న ప్లాన్ మరి వర్కవుట్ అవుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ఇంకా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మరియు పూజా హెగ్డేలు హీరోయిన్ లుగా నటించగా మణిశర్మ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.