నన్ను ఇండస్ట్రీలో ప్రోత్సహించింది ఆ హీరోలే.. అడివి శేష్ షాకింగ్ కామెంట్స్!

ఎన్నో విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి విషయాలను తన ఖాతాలో వేసుకుంటున్న యంగ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్షణం, గూడచారి వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో తాజాగా ఆయన నటించిన మేజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా జూన్ 3వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హీరో బుల్లితెరపై ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన సినిమా గురించి తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అడివి శేష్ మాట్లాడుతూ తనకు ఏ విధమైనటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేదని నటనపై ఆసక్తితో తాను ఇండస్ట్రీలోకి వచ్చానని ఆయన వెల్లడించారు.ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన సమయంలో తనకు ఎవరూ తెలియదని అయితే ఇండస్ట్రీలో పలువురు హీరోలు అందించిన ప్రోత్సాహంతోనే తాను ఇక్కడ ఉన్నానని తెలిపారు.

క్షణం సినిమా తర్వాత అల్లు అర్జున్ తనకు ప్రత్యేకంగా ట్వీట్ చేస్తూ సినిమా చాలా అద్భుతంగా ఉందని తన నటన బాగుందని ప్రశ్నించారని ఆయన తెలియజేశారు.ఇక పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమాలో నటిస్తున్న సమయంలో కో-డైరెక్టర్ వచ్చి హీరో కన్నా చాలా ఎక్కువ చేస్తున్నావు… కాసు తగ్గించుకో అంటూ తనకు సూచించారు.ఆ సమయంలో పవన్ కళ్యాణ్ డైరెక్టర్ ని ఆపి తన నటనను ఎంకరేజ్ చేశారు.

ఇకపోతే బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ తాను చేస్తున్న ప్రతి ఒక్క పనిని గమనిస్తూ తనకు ఎన్నో సూచనలు చేస్తూ ఉన్నారని,అలాగే తనపై నమ్మకంతో స్థాయిలో మేజర్ చిత్రాన్ని మహేష్ బాబు నిర్మిస్తున్నారని ఈ సందర్భంగా అడివి శేష్ తనకు ఇండస్ట్రీలో ఎంతో ప్రోత్సహించిన హీరోల గురించి తెలియజేశారు. వీళ్లే ఇండస్ట్రీలో తనను ఈ స్థాయికి తీసుకు వచ్చారని ఆయన తెలియజేశారు.