Actress Pragathi: తెలుగు సినీ ప్రేక్షకులకు నటి ప్రగతి గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఈమె తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. అయితే ప్రగతి సినిమాలలో ద్వారా ఎంత పాపులారిటీని సంపాదించుకుందో అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా అంతకు మించి పాపులారిటీని సంపాదించుకుంది. ప్రగతి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. సినిమాలలో సాంప్రదాయ పద్ధతిలో కనిపించినా ఈమె రియల్ లైఫ్ లో మాత్రం హాట్ గా ఫోజులు ఇస్తూ తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.
ఇప్పటికే ప్రగతి పలుసార్లు జిమ్ లో వర్కౌట్లు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక వర్కౌట్ చేస్తున్న సమయంలోనే ఆమె పలు సార్లు డాన్సులు కూడా చేసింది. అందుకు సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది ఇలా ఉండగా తాజాగా ప్రగతి మరొకసారి జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ డాన్స్ చేసిన వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో ప్రగతి సమంత చేసిన ఊ అంటావా మావా అనే పాటకు చెప్పులను ఇరగదీసింది.
ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్లు ప్రతి పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ప్రగతి అభిమానులు ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. మొత్తానికి నటి ప్రగతి మరొకసారి తన డాన్స్ తో ప్రేక్షకులను అలరించింది. ఇక సినిమాలలో ప్రగతి నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. ఎక్కువగా హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో, అక్క వదిన ల పాత్రల్లో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.