Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి అక్కగా ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఏ సినిమాలో తెలుసా?

ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన మీన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ తరం వారికి ఈమె గురించి పెద్దగా తెలియకపోయినప్పటి తరం వారికి ఈమె గురించి బాగా తెలుసు. అప్పట్లో వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. అలా ఎన్నో సినిమాల్లో, ఎంతోమంది అగ్ర హీరోల సరసన నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరుచుకుంది. ఇప్పటికీ ఆమె సినిమాల్లో నటిస్తూనే ఉంది. కేరళలో అయితే మీనాకీ బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికీ మీనా వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది.

ఈమె వయసు అయిపోయిన కూడా గ్లామర్ విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. తనకున్న క్రేజ్ తో అదే రీతిలో సినిమా అవకాశాలు అందుకుంటుంది. ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో మీనా ఒక కీలక పాత్రలో నటించనుందట. అయితే పవన్, హరీష్ కాంబినేషన్ లో వస్తున్న ఆ సినిమా నుంచి ఇప్పటివరకు ఎటువంటి అప్ డేట్ లేదు. త్వరలో సినిమా చేయబోతున్నానని ప్రకటించాడు కానీ ఎప్పుడు, ఏమిటి అన్న అంశాలపై క్లారిటీ ఇవ్వలేదు.

ఇకపోతే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ మే నుంచి మొదలు పెడుతున్నారు అని తెలుస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ అక్క పాత్ర ఒకటి ఉందని, ఆ పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుందని, ఆ పాత్ర కోసం మీనాని తీసుకునే ఆలోచనలో హరీష్ శంకర్ ఉన్నాడు అని తెలుస్తోంది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే మీనా ఖాతాలో మరొక భారీ సినిమా పడిందని చెప్పవచ్చు. ఈ వయసులో కూడా వరుస సినిమా అవకాశాలు వస్తుండటంతో సన్నగా మరి ఫిజిక్ మెయింటైన్ చేస్తోంది.