Actor Venkat: ఆ ఒక్క విషయంలో నాగార్జున లేకుంటే నేను లేను: యాక్టర్ వెంకట్

Actor Venkat: అన్నపూర్ణ ప్రొడక్షన్‌లో తాను ఇప్పుడు చేయబోయే ప్రాజెక్ట్ మూడోది అని ప్రముఖ నటుడు వెంకట్ తెలిపారు. ఫస్ట్ మూవీ చేసి చాలా సంవత్సరాలైందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ మధ్య కాలంలో వచ్చిన బేకర్ అండ్ బ్యూటీ మంచి విజయాన్ని సాధించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు చేయబోయే సినిమా కూడా అన్నపూర్ణ స్టూడియోస్‌తో మంచి సక్సెస్‌ను అందుకుంటుందని వెంకట్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇకపోతే తన మొదటి సినిమా చేసిన తర్వాత అక్కినేని నాగార్జునను తాను ఎప్పుడూ కలవలేదని, తాజాగా జరిగిన లూసర్ ఈవెంట్‌లోనే ఆయన్ను కలిశానని వెంకట్ చెప్పారు. తాను తన ఫస్ట్ మూవీ చేసే కంటె ముందు ముంబైలో ఉండేవాడినని, అక్కడి నుంచి వచ్చాక అన్నపూర్ణ స్టూడియోస్‌ గురించి తనకు అప్పట్లో తెలియలేదని ఆయన అన్నారు. దానికి గానూ తాను ఎప్పుడూ కృతజ్ఞతాభావంతోనే ఉంటానని ఆయన తెలిపారు.

ఇక తాను తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్నానంటే కారణం అక్కినేని నాగార్జున మరియు వైవిఎస్. చౌదరి గారు అని వెంకట్ చెప్పారు. చౌదరి గారికి కూడా ఫస్ట్ మూవీ కాబట్టి తామిద్దరూ సినీ పరిశ్రమలో ఉన్నామంటే కారణం నాగార్జున గారే అని ఆయన అన్నారు. ఆయనకు డైరెక్టర్‌గా ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పలేదని, కానీ మొన్న ప్రెస్‌మీట్ జరిగినపుడు అందులో మాత్రం నాగార్జున గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశానని ఆయన చెప్పారు. అలా ఆయన ఆ ఈవెంట్‌కు రావడం అనేది తనకు చాలా ఆనందం కలిగించిందని వెంకట్ అన్నారు. తాను ఇండస్ట్రీలోకి రాకముందు నుంచే చిరంజీవి గారన్నా, నాగార్జున గారన్నా ప్రత్యేకమైన అభిమానం అని ఆయన తెలిపారు. ఈ విషయం తాను ఇంతకు ముందే చాలా ఇంటర్వ్యూలలోనూ చెప్పానని ఆయన అన్నారు. అంతే కాకుండా నాగార్జున గారు ఎప్పుడూ ఎంతో యాక్టివ్‌గా మరియు స్టైలిష్‌గా ఉండడం తనకు చాలా నచ్చుతుందని వెంకట్ స్పష్టం చేశారు.