Bandla Ganesh : కుల వైరస్ : వైసీపీ సీనియర్ నేతపై బండ్ల గణేష్ సంచలన ట్వీట్ల దాడి.!

Bandla Ganesh :  టాలీవుడ్ లో ఎందరో ప్రముఖ నటులు ఉన్నారు అలాగే ఆ నటులతో పాటు స్టార్ ప్రొడ్యూసర్స్ మాత్రం చాలా తక్కువే ఉన్నారు అలాంటి వారిలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కూడా ఒకరు. అయితే బండ్ల గణేష్ నటుడు, నిర్మాత గానే కాకుండా తెలంగాణలో రాజకీయాల్లో కూడా వెళ్లిన సంగతి తెలిసిందే.

కానీ అనూహ్యంగా తన అతి ఉత్సాహం మూలాన మళ్ళీ సినిమాల్లోకి వచ్చేసారు.

ఇలా వచ్చి సోషల్ మీడియాలో మంచి చురుకుగా ఉండడం స్టార్ట్ చేసారు. వాటిలో చాలా వరకు తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ పైనే ట్వీట్ లు కనపడతాయి అది వేరే విషయం.
కానీ తాజాగా నిన్న రాత్రి నుంచి మాత్రం బండ్ల గణేష్ నుంచి పలు సంచలన ట్వీట్లు పడడం అటు సినీ వర్గాలతో పాటు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఏపీ అధికార పార్టీ వైసీపీ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఎంపీ విజయసాయి రెడ్డిపై బండ్ల గణేష్ ధ్వజమెత్తుతున్నారు. విజయసాయి రెడ్డి ఓ కులం అంతటినీ కూడా చాలా కించపరిచి మాట్లాడుతున్నారని ఆ కులం తనది కాబట్టి నేను ఎంత వరకు అయినా రియాక్ట్ అవుతానని ఎవరో ఒక రాజకీయ నాయకుడు నా కులంపై చెందిన వారు అయితే మొత్తం కులాన్ని అందులో ప్రజలని మాట అనడం సరికాదని కాస్త గట్టిగానే బండ్ల గణేష్ ట్వీట్ల వర్షం కురిపించారు.
“మీకు కులం నచ్చకుంటే …కమ్మ వాళ్ళు నచ్చకుంటే నేరుగా తిట్టoడి … చంద్రబాబును టీడీపీని అడ్డం పెట్టుకొని కమ్మ వారిని తిట్టకండి అధికారం శాశ్వతం కాదు. రేపు నువ్వు తప్పకుండా మాజీ అవుతావు ప్రతి కమ్మ వారు తెలుగుదేశం కాదు నేను కమ్మ వాణ్ణే కానీ టిడిపి కాదు.
అయ్యా ఆంధ్ర కి పట్టిన అష్ట దారిద్రమా, నీ పిచ్చకి నీ కుల పిచ్చకి నీ డబ్బు పిచ్చకి కమ్మ కులాన్ని బలిచేయ్యాలని చూస్తే చరిత్ర నీకు తిరిగి చర్లపల్లి చూపిస్తుంది.
నాకు వైఎస్సార్ అన్నా జగన్ అన్నా గౌరవం కానీ నువ్వు రాష్ట్రానికి పట్టిన దరిద్రం నువ్వు పెద్ద దరిద్రానివి,మా కులాన్ని ఎందుకు అన్నీ విషయాల్లో కి లాగుతున్నవ్. కెసిఆర్ ను చూసి నేర్చుకో అన్ని కులాల్లో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు. చంద్రబాబు తో ఉంటే ఆయనతో తేల్చుకో.విశాఖని దోచుకున్న డబ్బుతో హైదరాబాదు కొనుక్కో. వ్యక్తి మీద గొడవతో కులం మీద దూషణ చేస్తే జనం చెప్పు దెబ్బ రుచిచూపిస్తారు.
నీకు నచ్చకుంటే వ్యక్తి పేరు పెట్టి తిట్టు కానీ కులాన్ని కాదు…నిన్ను జైల్ కు పంపింది… కమ్మ వారు కాదు… త్వరలో  నువ్వు జగన్ కు వెన్నుపోటు పొడిచే దరిద్రుడివి… ఈ ట్వీట్ తరువాత నన్ను ఎంత ఇబ్బంది పెడతావో తెలుసు అన్నిటికీ సిద్ధపడే చేస్తున్నా.. కులాల పేరుతో చిచ్చు పెడితే నీ చరిత్రకి నువ్వే చింపి చిచ్చు పెట్టుకున్న పిచ్చ పిచ్చుక అవుతావు.”
ఇలా మరెన్నో సంచలన వ్యాఖ్యలను బండ్ల గణేష్ చెయ్యడం షాకింగ్ గా మారింది.
https://twitter.com/ganeshbandla/status/1515011771966562309?s=20&t=6metoMWvk_ocvZ0UJ2oiwg