Acharya : వైరల్ టాక్: రామ రామ.! ‘ఆచార్య’ అలా ప్రమోట్ అవుతోందా.?

Acharya : మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ పోషిస్తున్నసినిమా ‘ఆచార్య’.  ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. అయితే, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్‌ క్రేజ్ ఏ రేంజ్‌లో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆ క్రమంలో ‘ఆచార్య’ సినిమా రామ్ చరణ్ సినిమాలా ప్రమోట్ అవుతోందట. అసలే ప్యాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో రామ్ చరణ్.
‘ఆచార్య’ సినిమా ప్యాన్ ఇండియా మూవీ కాకపోయినా, చరణ్ నటిస్తుండడంతో ఆ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయట.
ఇది రామ్ చరణ్ సినిమానా.? లేక మెగాస్టార్ చిరంజీవి సినిమానా.? అనే స్థాయిలో బయటికి ప్రొజెక్ట్ అవుతోందట. చిరంజీవి ఈ విషయంలో చాలా అదృష్టవంతుడు అనే చెప్పాలి. తండ్రికి తగ్గ తనయుడిగా ఇంత వరకూ రామ్ చరణ్ పేరు తెచ్చుకున్నాడు.
చిరంజీవి తర్వాత ఆ లెగసీని అలా కంటిన్యూ చేస్తూ, దాదాపు తొమ్మిదేళ్ల పాటు చిరంజీవి సినిమాల్లో లేకపోయినా ఆ లోటు తెలియనివ్వకుండా కవర్ చేసేశాడు. ఇప్పుడు ‘ఆచార్య’ కోసం తండ్రితో కలిసి ఫుల్ లెంగ్త్ రోల్‌లో నటిస్తున్నాడు చరణ్.
‘ఆచార్య’ సినిమాకి రామ్ చరణ్ ఎంతలా మెయిన్ ఎస్సెట్ అవుతున్నాడో చూస్తుంటే, మళ్లీ మళ్లీ చరణ్‌ని మెచ్చుకోకుండా వుండలేకపోతున్నాం. మెగా అభిమానులకు ఇంతకన్నా కావల్సిందేముంది.
అన్నింటికీ మించి చిరంజీవికి ఇంతకు మించిన పుత్రోత్సాహం ఇంకేముంటుంది.!