షాకింగ్ : అందరికీ మాట రానివ్వకుండా చేసిన “ఆచార్య” టీఆర్పీ..!

Acharya Coming Early In OTT

మెగా ఫాన్స్ అయితే అంత త్వరగా మర్చిపోలేని కొన్ని కళాఖండాల్లో ఈ ఏడాది వచ్చిన భారీ చిత్రం “ఆచార్య” కూడా ఒకటి. ఒక్క మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ లోనే కాకుకుండా అప్పుడే RRR తో భారీ హిట్ అందుకున్న రామ్ చరణ్ ఫ్యాన్స్ కి కూడా ఆచార్య సినిమా గట్టి దెబ్బ లా మారింది.

దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ హైప్ తో వచ్చి టాలీవుడ్ లో ఓ ఎపిక్ డిజాస్టర్ గా నిలిచింది. మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత ఫాన్స్ మళ్ళీ తేరుకోలేదు. పైగా తర్వాత నష్టాల విషయం లో కూడా చాలా డ్రామా నడిచింది.

ఇక ఫైనల్ గా టెలికాస్ట్ విషయాల్లో కూడా అడ్డంకులు రాగా ఫైనల్ గా మాత్రం ఆచార్య మొదటిసారి టెలికాస్ట్ అందరికీ మైండ్ బ్లాక్ చేసి పారేసింది. ఆచార్య మొదటిసారి జెమినీ ఛానెల్లో టెలికాస్ట్ కాగా దానికి ఏకంగా 6.30 రేటింగ్ వచ్చేసింది.

ఇది అయితే రీసెంట్ గా హిట్స్ అయ్యిన అంటే సుందరానికి, సర్కారు వారి పాట చిత్రాలు ఫలితాలతో పోలిస్తే చాలా బెటర్ గా అందుకుందనే చెప్పాలి. వాటయికి పాజిటివ్ టాక్ దీనికి దారుణమైన డిజాస్టర్ టాక్ వచ్చింది. అయినా కూడా ఈ సినిమాకి ఈ రేటింగ్ రావడం అయితే కేజ్రీగా మారిపోయింది.

దెబ్బకి ఆచార్య మాత్రం ఇప్పుడు ఏ ఒక్కరికీ మాట రానివ్వకుండా చేసేసింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.