Acharya Producer : ఇప్పుడు మన తెలుగు సినిమా ఏ స్థాయిలో ఉందో తెలిసిందే. నిర్మాణం పరంగా సినిమా క్వాలిటీ పరంగా ఎక్కడా తగ్గకుండా ఓ రేంజ్ లో సినిమాలను ఇండస్ట్రీ వారు తెరకెక్కిస్తున్నారు. అయితే వీటిలో భాగంగానే ఎప్పటికప్పుడు మన టాలీవుడ్ స్టార్స్ తాలూకా రెమ్యునరేషన్ లు హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటాయి.
ఆ హీరో ఇంత తీసుకున్నాడు ఈ హీరో అంత మొత్తంలో తీసుకున్నాడు అని. అయితే నిజానికి అది వారి సంపాదన వారి క్రేజ్ కి నిర్మాత పెట్టే రేటు. దానిని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. కానీ తాజాగా ఈ రెమ్యునరేషన్స్ మూలాన కొన్ని కీలక మార్పులు కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో చోటు చేసుకున్నాయి.
అయితే మన టాలీవుడ్ టాప్ స్టార్స్ అంటే రెమ్యునరేషన్స్ భారీ స్థాయిలోనే ఉంటాయి. మరి లేటెస్ట్ గా భారీ సినిమా “ఆచార్య” విషయంలో ఆ సినిమా నిర్మాత చాలా మందికి కామెంట్ చేస్తున్న వారికి ఇస్తూ మెగాస్టార్ రామ్ చరణ్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు ఎంత తీసుకున్నారు అనేది వెల్లడి చేశారు.
వీరి పారితోషకం కోసం చాలా మంది చాలా మాటలు అంటున్నారని కానీ నిజానికి ఈ సినిమాని నాకు ఇద్దరు హీరోలు కూడా డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా చేసారని ఇది అందరు గమనించాలని తెలిపారు.
అంతే కాకుండా సినిమా రిలీజ్ అయ్యి ఎలాంటి ఫలితం అందుకుంటుందో అప్పుడు చూద్దాం అని చిరు మరియు రామ్ చరణ్ లు హామీ ఇచ్చారని హాట్ కామెంట్స్ చెయ్యడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
దీనితో హీరోల రెమ్యునరేషన్స్ పై మాట్లాడే వారికి ఒక సాలీడ్ క్లారిటీ వచ్చినట్టే అని చెప్పి తీరాలి.