Acharya Censor Talk : సెన్సార్ రిపోర్ట్ టాక్ : “ఆచార్య” సినిమా రిజల్ట్ ఎలా ఉందంటే..?

Acharya Censor Talk

Acharya Censor Talk :  ప్రస్తుతం భారీ అంచనాలతో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న లేటెస్ట్ క్రేజీ మల్టీ స్టారర్ సినిమా “ఆచార్య”. మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా కాజల్ అగర్వాల్ మరియు పూజా హెగ్డే లు హీరోయిన్స్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ భారీ సినిమా మరికొన్ని రోజుల్లో విడుదలకి సిద్ధంగా ఉంది.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ కి సంబంధించి కొన్ని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఇవి పక్కన పెడితే ఇపుడు ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ టాక్ తెలిసింది. ఇప్పటి వరకు చాలా మందికి ఈ సినిమా పట్ల ఎక్కడో డౌట్ ఉండొచ్చు కానీ దర్శకుడు కొరటాల మాత్రం ఊహించని “ఆచార్య” సినిమా చూపించబోతున్నాడట.

అలాగే సినిమా ఫస్ట్ హాఫ్ మరియు సెకండాఫ్ కూడా అవ్వకుండా ఉన్నాయి అని సినిమా చాలా బాగా వచ్చింది అని నో డౌట్ గా హిట్ అవుతుంది అని సెన్సార్ సభ్యులు చెప్పినట్టుగా తెలుస్తుంది.

దీనితో సినిమా రిజల్ట్ విషయంలో అయితే ఎవరూ ఎలాంటి డౌట్స్ పెట్టుకోనక్కర్లేదని చెప్పాలి. మొత్తానికి అయితే ఆచార్య కి సెన్సార్ నుంచి హిట్ టాక్ వచ్చేసింది. రేపు థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక ఆడియెన్స్ ఎలాంటి ఫలితాన్ని అందిస్తారో చూడాలి.

ఇక ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందివ్వగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు నిర్మాణం వహించారు.