Vastu Tips: భారతీయులు వాస్తు శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతారు. ఈ క్రమంలోనే మనం చేసే ఏ పని అయినా కూడా వాస్తు శాస్త్ర ప్రకారం సవ్యంగా ఉండేలా చేస్తాము. ఈ క్రమంలోనే మన ఇంట్లో ఏదైనా సమస్యలు తలెత్తినా లేదా ఇబ్బందులు వెంటాడుతున్న,అలాగే మనం చేసే పనులలో పురోగతి సాధించాలన్న వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలు చేయడం లేదా ఇంటిలో కొన్ని రకాల వస్తువులను అలంకరించుకోవడం చేస్తుంటాము. ఈ విధంగా కొన్ని రకాల వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా మనం చేసే పనులలో పురోగతి కనిపిస్తుంది.
ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు వారి వ్యాపార రంగంలో పురోగతి సాధించాలంటే తప్పనిసరిగా ఇంటిలో పటిక ఉండాల్సిందేనని వాస్తు నిపుణులు చెబుతున్నారు.ఈ విధంగా పటిక ఇంటిలో ఉండటం వల్ల ఇంటిలో అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడటమే కాకుండా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆ లక్ష్మి కటాక్షం కలుగుతుంది. అందుకే వ్యాపారం చేసే వ్యాపారస్తులు విద్యా రంగంలో ఉండే విద్యార్థులు పటికతో ఈ పరిహారం చేయాలని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.
వ్యాపారంలో పురోగతి సాధించాలనుకొనేవారు వారు వ్యాపారం చేసేచోట ఒక మూలలో ఈ పటికను ఉంచడం వల్ల వ్యాపారం దినదినాభివృద్ధి కలుగుతుంది.అలాగే ఇంట్లో నిత్యం గొడవలు పోట్లాటలు మనస్పర్థలు ఉంటే కనుక ఒక చిన్న గిన్నెలో పటిక వేసి దానిని ఇంట్లో ఒక మూల పెట్టాలి.ఇలా చేయడం వల్ల ఇంట్లో ఏర్పడినటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అలాగే దేవుని గదిలో నీటిలోకి పట్టిక వేసి పెట్టడం వల్ల వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయని పండితులు తెలియజేస్తున్నారు.