పవన్ ‘వీరమల్లు’ సెట్లో ప్రమాదం

accident happened in Veeramallu sets

accident happened in Veeramallu sets

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో ‘హరి హర వీరమల్లు’ కూడ ఒకటి. క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చారిత్రిక నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నిర్మాత ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ కేటాయించి సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ సెట్స్ వేసి షూటింగ్ చేస్తున్నారు. పెద్ద సినిమా కావడంతో స్టార్ నటీ నటులు నటిస్తున్నారు. వాళ్లలో ఆదిత్య మీనన్ కూడ ఉన్నారు. సినిమాలో ఈయన ఒక కీ రోల్ చేస్తున్నారట.

షూటింగ్లో భాగంగా ఆదిత్య మీనన్ గుర్రపు స్వారీ చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయారట. ఆ ప్రమాదంలో ఆయనకు గాయాలు బలంగా అయినట్టే తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే టీమ్ ఆయన్ను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారట. ఇంకాస్త మెరుగైన చికిత్స కోసం చెన్నై తీసుకెళ్లారట. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని అంటున్నారు. ఈ ప్రమాదంతో అప్రమత్తమైన వీరమల్లు టీమ్ నటీనటులకు యాక్షన్ సన్నివేశాలు చేసేటప్పుడు ఇంకా ఎక్కువ సేఫ్టీ మెజర్స్ పాటించాలని డిసైడ్ అయ్యారట.