ఇటీవల విశాఖలో చోటు చేసుకున్న ఎల్ జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటన దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. 12 మంది మృత్యువాత పడగా..వందలాది మంది అపస్మారక స్థితిలోకి వెళ్లి ప్రాణాలతో కొట్టిమిట్టారు. చివరికి ఎలాగూ ప్రాణాలతో కోలుకుని బయటపడ్డారు. ఎల్ జీ సిబ్బంది తప్పిదం వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది. అందుకు యాజమాన్యం మూల్యం చెల్లిస్తామని..క్షమాపణలు చెప్పింది. అయితే ఈ ఘటనకు కారణం ప్రభుత్వమే అంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదే పనిగా నీచ రాజకీయాలకు పూనుకున్నారు. జనావాసంలో ఈ కంపెనీ ఉండటంతోనే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందన్నది అందరికీ తెలిసిని సత్యం. అయితే ఇదంతా జరగడానికి 2015లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వమేనేని వైకాపా మంత్రులు ఆరోపిస్తున్నారు. 2015లో ఎల్ జీ పాలిమర్స్ కంపెనీ విస్తరణకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతులిచ్చారని ఆరోపించారు. దాదాపు 128 ఎకరాల సింహాచలం అప్పన్న స్వామి భూమిని బాబుగారే సదరు కంపెనీకి దారాదత్తం చేసారని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు.
దీనిపై చర్చకు వచ్చే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని సవాల్ విసిరారు. రాష్ర్ట అభివృద్దికి కంపెనీలు అవసరమే. కానీ ఇలా జనాలు ఉన్న చోట కంపెనీల విస్తరణ చేపట్టకూడదన్న విషయం బాబుగారికి తెలియదా? కంపెనీ ఎన్ని కోట్లు మూట జెప్పింది? మీకు తెలిసిన రూలింగ్ ఇదేనా? అంటూ గట్టిగా విమర్శించారు. ఇక పవన్ కళ్యాణ్ ముఖానికి రంగేసుకున్నంత ఈజీగా మాట్లాడేస్తున్నారని వైకాపా నేతలు విమర్శించారు. ఆయనగారేదో పెద్ద శాస్ర్తజ్ఞుడిలా కంపెనీలో ఉండే రసాయనాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.