ఎందుకొచ్చిన గొడవ అని సెలవు తీసుకున్న స్టార్ హీరో

aamir-khan-says-goodbye-to-social-media

ప్రజలకు దగ్గరవుదామని సోషల్ మీడియాలోకి వచ్చిన సెలబ్రిటీలకు షాక్ మీద షాకులు తగులుతున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్ని బెనిఫిట్స్ అయితే పొందుతున్నారో అన్ని ఎదురుదెబ్బలు కూడ తింటున్నారు. దేశంలో జరిగే ప్రతి వివాదం మీదా స్పందించాలని, ఏదో ఒక సైడ్ తీసుకోవాలని హీరో హీరోయిన్లను నెటిజన్లు తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారు. లేని పక్షంలో విమర్శలతో వారికి చుక్కలు చూపించేస్తున్నారు. ఇలా సంబంధంలేని విషయాల మూలంగా ఇబ్బందిపడిన సెలబ్రిటీలు చాలామందే ఉన్నారు.

ఈమధ్య బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ ఇబ్బందిని ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తోంది. కేంద్రం తీసుకుంటున్న అనేక నిర్ణయాల మీద, రాజకీయ వివాదాల మీద స్పందించాలని హిందీ స్టార్లను కిందా మీదా చేసేస్తున్నారు సోషల్ మీడియా జనం. అందుకే సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ సోషల్ మీడియాకు సెలవు ప్రకటించేశారు. అది కూడ శాశ్వతంగా. నిన్న తన పుట్టినరోజు సందర్బంగా ఈ విషయాన్ని ప్రకటించారు ఆయన. తాను ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటాను కాబట్టి సోషల్ మీడియా అవసరం లేదని అనుకుంటున్నానని అందుకే పూర్తిగా దూరంగా వెళ్తున్నానని ప్రకటించారు. ఓపెన్ గా ఒప్పుకోలేదు కానీ అనవసరంగా రాజకీయ వివాదాల్లో ఇరుక్కోవడం ఎందుకనే ఉద్దేశ్యంతోనే ఆమిర్ ఖాన్ వైదొలగారు.