Aamir Khan: తనకంటే 23 ఏళ్లు చిన్న హీరోయిన్ తో రొమాన్స్ చేసిన అమీర్ ఖాన్.. హీరో రియాక్షన్ ఇదే!

Aamir khan: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అమీర్ ఖాన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు వ్యక్తిగత విషయాలలో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారు అమీర్ ఖాన్. సినిమాలలో ఎలాంటి ఈ పాత్రలో నటించిన ఆ పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేయడంతో పాటు ప్రేక్షకులను కూడా ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా పాత్రకి తగ్గట్టుగా తన శరీరాన్ని మార్చేసుకుంటూ ఉంటారు.

ఇకపోతే హీరో అమీర్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సితారే జమీన్ పర్. ఈ సినిమాలో దాదాపు 40 ఏళ్ల పాత్రలో నటిస్తున్నాడు అమీర్ ఖాన్. సినిమాలో 40 ఏళ్ళు అయినప్పటికీ నిజ జీవితంలో మాత్రం ఆయన వయసు 60 ఏళ్లు అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆమిర్ జెనీలియా దేశ్ ముఖ్ తో జత కట్టాడు. ఆమె వయసు ఇప్పుడు సుమారు 37 సంవత్సరాలు. అంటే అమిర్ ఖాన్, జెనీలియా మధ్య సుమారు 23 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది. అయితేనేం సితారే జమీన్ పర్ సినిమాలో ఇద్దరు కలిసి నటించారు. ఆశ్చర్యకరంగా జెనీలియా ఒకప్పుడు ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్‌ తో హీరోయిన్ గా జతకట్టిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఆమిర్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి ఏజ్ గ్యాప్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వచ్చాయి. ముఖ్యంగా అమెరికా తన కంటే దాదాపు 23 ఏళ్లు చిన్న వయసు ఉన్న హీరోయిన్ తో నటించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవడంతో పాటు కొంతమంది ట్రోల్స్ చేయడంతో తాజాగా ఈ విమర్శలపై అమీర్ ఖాన్ స్పందించారు. తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ..

చాలా కాలం క్రితం, ఇమ్రాన్ ఖాన్ జెనీలియాతో జత కట్టింది. కానీ ఇప్పుడు ఇమ్రాన్ నా వయస్సు వాడిలా కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో నేను, జెనీలియా 40 ఏళ్ల వయసు ఉన్నవారి పాత్రలు పోషించాము. జెనీలియా ఇప్పుడు దాదాపు ఆ వయసులోనే ఉంది కదా. నాకు ఇప్పుడు 60 ఏళ్లు. ఇప్పుడు మన దగ్గర VFX టెక్నాలజీ ఉంది. కానీ గతంలో, నేను 18 ఏళ్ల పాత్ర పోషించాల్సి వస్తే నేను ప్రోస్తేటిక్స్ మేకప్ చేయించుకోవాల్సి వచ్చేది. 1989లో, అనిల్ కపూర్ 80 ఏళ్ల వ్యక్తి పాత్రను పోషించాడు. అప్పుడు అతను యువకుడు. ఇప్పుడు, VFX విషయంలో, నటులకు వయోపరిమితి లేదు అని అమీర్ ఖాన్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అమీర్ ఖాన్ నటించిన ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.