Aamir Khan: నా మొదటి భార్యతో విడాకులు తీసుకోవడానికి కారణం అదే.. అమీర్ ఖాన్ కామెంట్స్ వైరల్!

Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గురించి మనందరికీ తెలిసిందే. ఈయన సినిమాలకు సంబంధించిన విషయాలలో మాత్రమే కాకుండా తన వ్యక్తిగత విషయాలలో కూడా ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ముఖ్యంగా ప్రేమ పెళ్లి విడాకుల విషయంలో ఎక్కువగా వార్తలు నిలిచిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే రెండుసార్లు రెండు పెళ్లిళ్లు చేసుకున్న అమీర్ ఖాన్ తన ఇద్దరు భార్యలతో విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మూడో వివాహానికి కూడా సిద్ధమయ్యాడు అని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో అమీర్ ఖాన్, రీనా దత్తాను పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత కిరణ్ రావు ని పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే ఆమెతో కూడా విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే ప్రస్తుతం గౌరీ అనే ఒక బెంగళూరుకు చెందిన మహిళతో ప్రేమలో ఉన్నారు అమీర్ ఖాన్. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. ఈ వ్యవహారాల గురించే ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా స్పందించారు అమీర్ ఖాన్. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ సితారే జమీన్ పర్. ఈ సినిమా జూన్ 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.

అందులో భాగంగానే తన మొదటి భార్యతో విడాకులు తీసుకుని విడిపోవడానికి గల కారణాన్ని కూడా వివరించారు. అమీర్ ఖాన్, రీనా దత్తా 1986 లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వారు 2002 లో విడాకులు తీసుకున్నారు. వివాహం జరిగినప్పుడు ఇద్దరూ చిన్న వయస్సులోనే ఉన్నారట. ఇదే తమ కుటుంబంలో చీలికకు కారణమని ఆమిర్ ఖాన్ చెప్పుకొచ్చారు. అమీర్ ఖాన్ ఈ విషయంపై మాట్లాడుతూ.. రీనా, నేను చాలా త్వరగా పెళ్లి చేసుకున్నాము. అప్పుడు నాకు 21 సంవత్సరాలు. ఆమె వయస్సు 19 సంవత్సరాలు. మేము ఒకరినొకరు 4 నెలలు మాత్రమే తెలుసు. మేము కలిసి ఎక్కువ సమయం గడపలేదు. మేము ఒకరినొకరు ఎక్కువగా ప్రేమించుకున్నాము. కాబట్టి మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, వివాహం గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలని నాకు అనిపిస్తోంది. టీనేజ్ ఉత్సాహంలో, నేను చాలా విషయాలను అర్థం చేసుకోలేకపోయాను. రీనాతో నా జీవితం చాలా బాగుంది. ఆమె వైపు నుంచి ఎలాంటి తప్పలేదు. ఆమె చాలా మంచి వ్యక్తి. మేం కలిసి పెరిగాము. పరస్పర గౌరవం ఉంది. కానీ ఎవరూ తొందరపడి పెళ్లి చేసుకోకూడదు అని అమీర్ ఖాన్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.