అభిమానుల‌తో ఇంట‌రాక్ష‌న్.. మ‌ళ్ళీ సిక్స్ ప్యాక్ చూపిస్తారా అన్న ప్ర‌శ్న‌కు బ‌న్నీ క్రేజీ స‌మాధానం

గంగోత్రి సినిమాతో హీరోగా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం అయిన అల్లూవార‌బ్బాయి అల్లు అర్జున్. హిట్స్ , ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాలు చేస్తున్న అల్లు అర్జున్ గ‌త ఏడాది అల వైకుంఠ‌పురములో అనే సినిమాతో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్ళు రాబట్ట‌డ‌మే కాక ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. ఇక ఇప్పుడు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు బ‌న్నీ.గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో పుష్ప‌రాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపించి అల‌రించ‌నున్నాడు.

ఓ వైపు పుష్ప సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ, స‌మంత హోస్ట్ చేస్తున్న సామ్ జామ్ షోకు త‌న తండ్రితో క‌లిసి హాజ‌ర‌య్యారు. స‌మంత అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఇంట్రెస్టింగ్ స‌మాధానాలు ఇచ్చాడు బ‌న్నీ. అయితే బ‌న్నీతో సామ్ ఇంట‌ర్వ్యూ సుదీర్ఘంగా జ‌రిగిన‌ట్టు తెలుస్తుండ‌గా, ఇందుకు సంబంధించి ఆహా ఓటీటీలో కొంత వ‌ర‌కు మాత్ర‌మే ప్ర‌సారం చేశారు. మిగ‌తా ర‌ష్‌ను అన్‌సీన్ వీడియోలుగా అప్పుడ‌ప్పుడు విడుద‌ల చేస్తూ ఫ్యాన్స్‌కు థ్రిల్ క‌లిగిస్తున్నారు.

తాజాగా అభిమానుల‌తో అల్లు అర్జున్ ఇంట‌రాక్ష‌న్ వీడియోను రిలీజ్ చేయ‌గా, ఇందులో బ‌న్నీని వెరైటీ ప్ర‌శ్న‌లు అడిగారు ఫ్యాన్స్. అమ్మాయిలు అయితే బావ అంటూ బ‌న్నీని పిలుస్తుండ‌గా, అబ్బాయిలు బ‌న్నీ అన్న అనుకుంటూ త‌మ ప్రేమ‌ను చాటుకున్నారు. తెలుగు ఇండ‌స్ట్రీకి సిక్స్ ప్యాక్ ప్యాక్ ప‌రిచ‌యం చేసిన మీరు ఎప్పుడు మ‌ళ్లీ సిక్స్ ప్యాక్‌లో క‌నిపించ‌నున్నార‌ని ఓ అభిమాని అడిగాడు. దీనికి బదులిచ్చిన అల్లు అర్జున్ అది త్వ‌ర‌లోనే జ‌రుగుతుంద‌ని అన్నాడు. ఇక పుష్ప సినిమాలో మాస్ సాంగ్ ఉంటుందా అన్న ప్ర‌శ్న‌కు ఉంటుంద‌ని పేర్కొన్నాడు.

Allu Arjun On Sam Jam | Unseen | AA Interacting With Fans | Samantha Akkineni | An aha Original