రజినీ అభిమానులకు నిజంగా శుభవార్తే ఇది.!

కోలీవుడ్ తలైవర్ రజినీకాంత్ కాంత్ గత కొన్ని రోజులు కితమే అనారోగ్యంతో మళ్లీ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే అంతకు ఒక రెండు మూడు నెలల కితమే రజినీ అమెరికాలో ఓ కీలక చికిత్స నిమిత్తం వెళ్లి కూడా వచ్చారు. అయితే ఇదిలా ఉండగా రజినీ ఇలా ఇక్కడ అడ్మిట్ కావడం పైగా ఆ రోజు రాత్రే సౌత్ ఇండియా సినిమాకి చెందిన నటుడు పునీత్ రాజ్ కుమార్ తన తుది శ్వాస విడవడం తీవ్ర కలహాన్ని రేపింది.

అయితే ఇదిలా ఉండగా రజినీకాంత్ అభిమానులకు మాత్రం భారీగా ఊరటనిచ్చే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. రజినీకాంత్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారట. హాస్పిటల్ నుంచి నిన్న రాత్రి సమయంలో తలైవర్ డిశ్చార్జ్ అయ్యినట్టు తెలుస్తోంది. దీనితో ఎన్నో పూజలు చేసిన అభిమానులు అలాగే సినీ ప్రముఖులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇదిలా ఉండగా ఇంకో రెండు రోజుల్లో రజినీ హీరోగా నటించిన భారీ సినిమా “అన్నాత్తే” తెలుగులో “పెద్దన్న” గా భారీ లెవెల్లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.