Gold Robberyదొంగలు దొంగతనం చేయడానికి, దొంగతనం చేసిన తర్వాత పోలీసులకు దొరకకుండా ఉండడానికి, అలాగే దొంగతనం చేసిన డబ్బు, విలువైన ఆభరణాలు, వస్తువులు అలా వారు దొంగతనం చేసిన వాటిని పోలీసుల కంటపడకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరు దొంగలు పోలీసులకు దొరకకూడదు అని ఎత్తుగడలు వేస్తూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వారు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యి పోలీసులకు చిక్కి పోతూ ఉంటారు. పోలీసులు కూడా అప్డేటెడ్ గా ఉంటూ దొంగలు వేసిన ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వారిని ఈజీగా పట్టేసుకుంటున్నారు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక దొంగ కూడా ఎవరికీ కనిపించకూడదు, ఎవరికి డౌట్ రాకూడదు అన్న ఉద్దేశంతో చోరీ చేసిన బంగారాన్ని ఏకంగా స్మశాన వాటికలో దాచిపెట్టాడు.
ఇక ఆ దొంగను సీసీ టీవీ పుటేజ్ ద్వారా గుర్తించిన పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా ఆ దొంగ నిజం ఒప్పుకోక తప్పలేదు. ఈ ఘటన తమిళనాడులోని వెల్లూరులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..వెల్లూరు లోని ప్రముఖ బంగారు ఆభరణాల దుకాణంలోకి అనైకట్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ముసుగు ధరించి ఇటీవల దొంగతనం చేసేందుకు వెళ్లాడు. అనుకున్న విధంగానే పక్కా ప్లాన్ తో ఏకంగా 15 కేజీల బంగారాన్ని చోరీ చేశాడు. అయితే అంత భారీ బంగారాన్ని, అంత విలువ చేసే బంగారాన్ని ఎవరికి డౌట్ రాకుండా శ్మశానవాటికలో దాచిపెట్టాడు. బంగారం చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించారు.
అనంతరం ఆ దొంగను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక చివరకు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు బంగారం గురించి తమదైన శైలిలో విచారించగా ఆ నిందుతుడు చెప్పిన సమాధానాలు విన్న పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెల్లూరు పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడుకత్తూరు వద్ద ఉన్న శ్మశానవాటికలో అతను చోరీ చేసిన బంగారాన్ని దాచిపెట్టినట్లు చెప్పాడు. అక్కడికి వెళ్లి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు.