KGF Producers : ఇదెక్కడి మాస్.. ఆర్సీబీతో సెన్సేషనల్ అనౌన్సమెంట్ ఇచ్చిన “కేజీఎఫ్” నిర్మాతలు!

KGF Producers :  ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకుని జస్ట్ కొన్ని రోజుల్లో రిలీజ్ కి రెడీగా ఉన్న భారీ సినిమా ఏదన్నా ఉంది అంటే అది కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న సెన్సేషనల్ ఏక్షన్ థ్రిల్లర్ సినిమా “కేజీఎఫ్ చాప్టర్ 2” అని చెప్పాల్సిన పని లేదు అందరికీ తెలుసు.
ఈ సినిమాని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా యష్ హీరోగా నటించాడు.
అయితే నిన్ననే ఈ సినిమా తాలుకా నిర్మాణ సంస్థ అయినటువంటి హోంబలే ఫిలింస్ వారు ఒక బిగ్ అనౌన్సమెంట్ ని ఈరోజు చేస్తునట్టు తెలిపారు. మరి దేనిని ఈరోజు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు రివీల్ చెయ్యగా ఇది చూసి నిజంగా ఇండియన్ సినిమా మరియు సినిమా అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
నిజంగానే ఆ రేంజ్ మాసివ్ సెన్సేషనల్ అనౌన్సమెంట్ ఇదే అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇండియన్ సినిమా దగ్గర ఏ ప్రొడక్షన్ సంస్థ కూడా చెయ్యని విధంగా ఒక ఐపీఎల్ టీం తో వీరు టై అప్ అయ్యినట్టుగా అనౌన్స్ చేశారు. అది కూడా తమ సినిమా ఇండస్ట్రీ మాతృ జట్టు అయినటువంటి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో అట.
ఇంకా దీనిపై కట్ చేసిన క్రేజీ టీజర్ చూస్తే అటు కోహ్లీ ఫ్యాన్స్ కి ఇటు యాష్ ఫాన్స్ కి మెంటల్ మాస్ అని చెప్పాల్సిందే. ఆ రేంజ్ లో వీడియోతో చిత్ర యూనిట్ ఈ నెవర్ బిఫోర్ అనౌన్సమెంట్ ని చేశారు.
ఒక క్రికెట్ టీం తో సినీ నిర్మాణ సంస్థ కలవడం అనేది చాలా ఆసక్తికర అంశం అని చెప్పాలి మరి ముందు రోజుల్లో వీరి నుంచి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయో చూడాల్సిందే.
https://twitter.com/hombalefilms/status/1513030263432962048?s=20&t=ATowFO9dp80OoZpGbX0ygQ