Sameer:సమీర్ బుల్లితెర పై చాలా సీరియల్స్ లో హీరోగా నటించి ఒక సీరియల్ హీరోయిన్ తో ఎఫైర్ ఉందనే రూమర్ తో బుల్లితెర అవకాశాలు చేజారడంతో అనూహ్యంగా వెండి తెరమీద అదృష్టాన్ని పరీక్షించుకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.
అయితే రీసెంట్ గా యూట్యూబ్ లో ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, కెరీర్ కి సంబంధించిన విషయాలు మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పారు.మెగా బ్రదర్స్ నాగబాబు, పవన్ కళ్యాణ్ తో చిన్న మనస్పర్థల కారణంగా సినిమా అవకాశాలు తగ్గి ఇబ్బందులు పడ్డానని చెప్పారు.
వివరాల్లోకి వెళ్తే స్వతహాగా పవన్ కళ్యాణ్ అభిమాని అయిన సమీర్ కొమరం పులి సినిమా చూసాక తన అభిప్రాయాలను ఒక ఆర్టికల్ రూపంలో రాసి పోస్ట్ చేసారు పవన్ కళ్యాణ్ లాంటి హీరో చేయాల్సిన సినిమా కాదని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. దీంతో నాగబాబు గారు సమీర్ కి కాల్ చేసి జర్నలిస్ట్ లాగా ఆర్టికల్స్ ఎందుకు రాస్తున్నావ్ ఆ పోస్ట్ ను డిలీట్ చేయమనగా వెంటనే డిలీట్ చేసానని అయితే ఆ పోస్ట్ నాగబాబు గారు అసలు చూడలేదని తన సోదరి చూసి చెప్పగా అయన కాల్ చేసారని చెప్పుకొచ్చారు.
ఈ ఉదాంతం ఇంతటితో ఆగకుండా పవన్ కళ్యాణ్ అసిస్టెంట్ నుండి కాల్ వచ్చింది. కాల్ చేయకపోయినా పవన్ కళ్యాణ్ కాల్ చేసి ఎందుకు ఇలాంటి పోస్ట్ పెట్టావ్ అని అడిగారని ఆ తర్వాత నాగబాబుకి నాకు మధ్యలో గ్యాప్ వచ్చిందని ఆ సమయంలో సినిమా అవకాశాలు బాగా తగ్గాయాని చెప్పారు. అయితే చాలా తక్కువ సమయంలోనే ఈ వివాదాన్ని పరిష్కరించుకున్నామని సదరు ఇంటర్వ్యూలో సమీర్ తెలిపారు.