మాసివ్ అప్డేట్ : “పుష్ప 1” లో భారీ లెవెల్ సాంగ్ అట..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తొలిసారిగా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న సినిమా “పుష్ప”. మొత్తం రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమాలో మొదటి భాగం ఇప్పుడు కంప్లీట్ అయ్యిపోవచ్చింది. మరి లేటెస్ట్ గా అయితే ఓ మాసివ్ అప్డేట్ సినిమాపై బయటకి వచ్చింది. ఈ చిత్రంలో ఇప్పుడు ఓ భారీ లెవెల్ సాంగ్ చిత్రీకరణ జరుపుకుంటుంది అట.

మొత్తంగా 1000 మంది డాన్సర్స్ తో ఈ సాంగ్ ని ప్లాన్ చేసారట. అంతే కాకుండా సినిమాలో సాంగ్ కూడా విజువల్ గా చాలా గ్రాండ్ గా ఉంటుందని తెలుస్తుంది. మాస్ గెటప్ లో అల్లు అర్జున్ ఈ సాంగ్ ల్ దర్శనం ఇస్తాడు అని అంతేకాకుండా చాలా కాలంగా మిస్సవుతున్న బన్నీ మాస్ డాన్స్ ని ఇందులో ఉండేలా డిజైన్ చేస్తున్నారని టాక్. ఇక ఈ సాంగ్ విజువల్ గా ఎలా ఉంటుందో చూడాలి.