పవన్ సినిమా విషయంలో విజయ్ దేవరకొండకి గడ్డి పెట్టిన చిన్న పిల్లాడు..!

vijay devarakonda : టాలీవుడ్ లో వేరే లెవెల్ క్రేజ్ ఉన్న స్టార్ హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ కోసం స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఆ రేంజ్ లో పవన్ కి క్రేజ్ ఉంది. ఎప్పుడో తన సినిమాలతో ట్రెండ్ ని సెట్ చేసిన పవన్ తన కేరీర్ లో భారీ హిట్స్ ని కూడా సొంతం చేసుకున్నారు. అయితే మరి వాటిలో క్లాసిక్ హిట్ “ఖుషి” కూడా ఒకటి.

ఆ సినిమా హిట్ సెన్సేషన్ అయితే ఇప్పటికీ కూడా మాట్లాడుకుంటారు. కానీ రీసెంట్ గా అయితే ఈ సినిమా టైటిల్ తో టాలీవుడ్ యంగ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరియు సమంత అలాగే దర్శకుడు శివ నిర్వాణ ల కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయ్యింది.

అయితే మొదట రూమర్స్ లోనే ఈ సినిమాకి “ఖుషి” అనే టైటిల్ పెడతారు అని వినిపించినప్పుడే అనుకోని విధంగా పవన్ ఫ్యాన్స్ స్పందించారు. ఇక అధికారికంగా వచ్చాక కూడా అదే నిజం అయ్యింది. దాదాపు చాలామంది పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే పవన్ అభిమాని అందులోని విదేశానికి చెందిన ఓ చిన్న పిల్లాడు విజయ్ దేవరకొండ కి ఈ సినిమా యూనిట్ కి గడ్డి పెట్టడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సోషల్ మీడియా ట్విట్టర్ ఫాలో అయ్యేవాళ్ళకి అయితే పోలాండ్ కి చెందిన జ్ బిగ్నియూ అనే చిన్న కుర్రాడు మన తెలుగు సినిమాల పాటలు పవన్ సినిమాల పాటలు పాడి మంచి ఫేమస్ అయ్యాడు.

అతడు విజయ్ దేవరకొండ మిగతా టీం కి నాకు ఎంతో ఇష్టమైన సినిమా టైటిల్ కాపీ కొట్టడం ఏంటి? మీకు మైండ్ లో కొత్త ఆలోచనలు లేవా? కాపీ క్యాట్స్ విజయ్ నువ్ అయినా ఆ టైటిల్ పెట్టుకున్నందుకు సినిమాకి న్యాయం చెయ్యగలవా అంటూ ప్రశ్నించాడు. మొత్తానికి విజయ్ కి పవన్ అభిమానులకి మధ్య వార్ ఇలా నడుస్తుంది. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.