RRR : గెట్ రెడీ – అక్కడి ప్రేక్షకులకి “RRR” నుంచి సాలిడ్ ట్రీట్ సిద్ధంగా ఉందట.!

RRR : గెట్ రెడీ – అక్కడి ప్రేక్షకులకి “RRR” నుంచి సాలిడ్ ట్రీట్ సిద్ధంగా ఉందట.!పాన్ ఇండియా ఆడియెన్స్ సహా ఓవర్సీస్ లో కూడా ఉన్నటువంటి ప్రవాస భారతీయులు కూడా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR). జక్కన్న రాజమౌళి ఇద్దరు మాస్ హీరోస్ అయినటువంటి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో తెరకెక్కించిన ఈ విజువల్ మరియు బిగ్గెస్ట్ ఆక్షన్ స్పెక్టాక్యులర్ ఓ రేంజ్ లో అంచనాలు నెలకొల్పుకొని సిద్ధంగా ఉంది.

ఇక ఇదిలా ఉండగా రిలీజ్ కి చాలా రోజుల సమయం ఉన్నప్పటికీ ఆల్రెడీ అమెరికన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డు ప్రీమియర్స్ కొల్లగొడుతున్న ఈ సినిమా నుంచి ఇప్పుడు అక్కడి ఆడియెన్స్ కోసం ఓ క్రేజీ అప్డేట్ ని అందిస్తున్నట్టుగా ఈ సినిమా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ అయినటువంటి సరిగమ సినిమాస్ మరియు రాఫ్టర్ క్రియేషన్స్ వారు తెలుపుతున్నారు.

ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా అందుకోని ఘనత అంటూ రేపు ఆ ఎగ్జైటింగ్ అనౌన్సమెంట్ ఏంటో రివీల్ చేస్తామని టీజ్ చేస్తున్నారు. దీనితో అందరిలో ఎప్పుడు మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈ భారీ సినిమాలో ఆలియా భట్ మరియు ఒలీవియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించగా అజయ్ దేవగన్ మరియు శ్రేయ శరన్, సముద్రకని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే ఎం ఎం కీరవాణి సంగీతం అందివ్వగా డీవీవీ దానయ్య నిర్మాణం వహించారు.