Bheemla Nayak: భీమ్లా నాయక్ సినిమా టికెట్లకి డబ్బు ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్న అభిమాని!

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వ్యక్తి ఎవరూ ఉండరు. తన కెరియర్ లో ఎన్నో ఫ్లాప్ మూవీలను ఎదుర్కొన్నప్పటికీ ఎంతోమంది అభిమానాన్ని తన సొంతం చేసుకున్నారు. ఇటీవల విడుదలైనటువంటి వకీల్ సాబ్ సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు.

ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమాను పూర్తిచేసుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే ఇందులో విలన్ గా రానా దగ్గుబాటి డానియల్ శేఖర్ పాత్రలో నటిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న విడుదల చేస్తామని ఫీలిమ్ మేకర్స్ తెలియజేశారు. కానీ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంటుందంటున్నారు.
ఈ క్రమంలోనే ముందుగానే అభిమానులు బీమ్లా నాయక్ సినిమా కోసం ఫ్రీ బుకింగ్ చేసుకుంటున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని టికెట్ కోసం తండ్రిని డబ్బులు అడగగా దినసరి కూలీ అయినటువంటి తండ్రి 300 రూపాయలు తనకిప్పుడు ఇవ్వడం కష్టమని మళ్లీ ఇస్తానని చెప్పాడు. కానీ అది అర్థం చేసుకోలేని కొడుకు ఆవేశంతో ఉరివేసుకొని చనిపోయాడు.

మనస్తాపంతో దారుణం….
వివరాల్లోకి వెళితే ఈ ఘటన జగిత్యాలలోని పురానీ పేటలో చోటు చేసుకుంది. ఆ వీర అభిమాని 11 సంవత్సరాల వయసు కలిగిన నవదీప్ 8వ తరగతి చదువుతున్నడు తన స్నేహితులతో కలిసి భీమ్లా నాయక్ సినిమాకి వెళ్లాలని తండ్రిని అడగడంతో లేదని చెప్పే సరికి తమ ఇంటి బాల్కనీ నందు ఈ దారుణం చేశాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు కొడుకు చనిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇది తెలుసుకున్న అక్కడి స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎంతో ప్రేమతో పెంచుకున్న కొడుకు వారి కళ్ల ముందే చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు బాధను విలపిస్తున్నారు.