Chiranjeevi : ఇన్సైడ్ టాక్ : చిరు మాస్ బొమ్మ కోసం ఈ తరహా ఇంట్రెస్టింగ్ టైటిల్ సిద్ధం..?

Chiranjeevi : ఇప్పుడు టాలీవుడ్ సినీ వర్గాల్లో వినిపిస్తున్న పేరు మెగాస్టార్ చిరంజీవి తనని ఎందుకు ఇండస్ట్రీ పెద్ద అంటారో తన సినిమాల స్టామినా తోనే కాకుండా తన చేతలు సినిమాకి కష్టం వస్తే వ్యవహరించిన తీరు చూసి దిగ్గజ దర్శక హీరోలే చిరు కి ఇప్పుడు సలాం కొట్టారు. మరి అలాంటి మెగాస్టార్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాలు కొన్ని ఇప్పుడు ఉన్నాయి.

వాటిలో దర్శకుడు కొరటాల శివతో తీసిన భారీ సినిమా “ఆచార్య” రిలీస్ కి రెడీగా కూడా ఉంది. మరి మిగిలిన వాటిలో అయితే రెండు రీమేక్స్ కాగా వాటిలో ఇంకా టైటిల్ ఖరారు కాని చిత్రం ఒకటి ఉంది. అదే దర్శకుడు బాబీ తో ప్లాన్ చేసిన భారీ మాస్ చిత్రం. మళ్ళీ పాత మెగాస్టార్ ని గుర్తు చేస్తానని బలంగా చెబుతున్న ఈ యంగ్ దర్శకుడు మరిన్ని అంచనాలు నెలకొల్పుకుంది.

ఇక ఇప్పుడు ఈ సినిమాపైనే క్రేజీ బజ్ లు వినిపిస్తున్నాయి. ఇది వరకు ఈ చిత్రానికి “వాల్తేర్ వీరయ్య” అనే మాస్ టైటిల్ వినిపించిన సంగతి తెలిసిందే. వైజాగ్ నేపథ్యంలో మెగాస్టార్ పై నడిచే సినిమా ఇది కావడంతో ఈ టైటిల్ పెట్టారని తెలిసింది. కానీ ఇప్పుడు దీనికి చిన్న మార్పు చేసి ఇంకో అదిరే టైటిల్ ని పెట్టినట్టుగా ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది.

ఆ టైటిలే “వాల్తేర్ మొనగాడు” అట. గతంలో రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు తరహా మాస్ టైటిల్స్ లా ఇది కూడా వినిపిస్తుంది. దీన్ని బట్టి దర్శకుడు ఎంత కేర్ గా మెగా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చే ప్లాన్ చేస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ టైటిల్ పై క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.