పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రానా దగ్గుబాటి మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న మాస్ ఏక్షన్ చిత్రం “భీమ్లా నాయక్” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా షూట్ ఇప్పుడు దగ్గర దగ్గర పూర్తి కావస్తోంది. అయితే ఈ చిత్రం ఆల్రెడీ వచ్చే సంక్రాంతి బరిలో సిద్ధంగా ఉందని మేకర్స్ క్లారిటీ ఇచ్చి ఇప్పుడు వరకు జనవరి 12 డేట్ నే చెప్తున్నారు.
కానీ అక్కడ రాజమౌళి సినిమా ట్రిపుల్ ఆర్(RRR) ఉండడంతో లాస్ట్ మినిట్ లో అయినా భీమ్లా నాయక్ డేట్ మారొచ్చని సినీ వర్గాల్లో ఇప్పుడు టాక్ మొదలయ్యింది. ఇక దీనికి సంబంధించి అప్డేట్ ఇంకొన్ని రోజుల్లో రానుంది అని తెలుస్తోంది.
అంతేకాకుండా ఈ చిత్రం జనవరి నుంచి మార్చ్ నెలకి షిఫ్ట్ అయ్యింది అని కూడా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. ఇక ఈ సినిమా ని సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్ వాళ్ళు నిర్మాణం వహిస్తున్నారు.