Salman Khan : చిరు సినిమాలో సల్మాన్ పాత్ర తెలిసిపోయింది.. బిగ్ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు.!

Salman Khan : తెలుగు సినిమా దిగ్గజ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. మరి ఇప్పుడు మళ్ళీ తన సినిమా కెరీర్ లో రీఎంట్రీ ఇచ్చాక తన పాత రోజుల్లో లా ఏకంగా ఒక్క రోజులో రెండు మూడేసి సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. మరి అలా ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో రెండు కీలక రీమేక్ సినిమాలు కూడా ఉన్నాయి.
వాటిలో ఒకటి తమిళ రీమేక్ సినిమా “భోళా శంకర్” కాగా మరొకటి మలయాళ హిట్ సినిమా రీమేక్ “గాడ్ ఫాథర్”. ఇప్పుడు ఈ రెండు సినిమాలు షూటింగ్ లు కూడా  శరవేగంగా జరుగుతుండగా ప్రస్తుతం అయితే అడ్డు ఫాదర్ షూటింగ్ హైదరాబాద్ లో అవుతుంది.
మరి ఈ భారీ సినిమాలో ఇండియాస్ మరో బిగ్గెస్ట్ స్టార్ అయినటువంటి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఎంటర్ అయ్యిన సంగతి తెలిసిందే. దీనితో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ హైప్ ని తెచ్చుకుంది. మరి ఇప్పుడు ఈ సినిమాలో సల్మాన్ పై ఒక కీలక షెడ్యూల్ ని కంప్లీట్ చేసినట్టుగా దర్శకుడు జయం మోహన్ రాజా తెలిపారు.
అలాగే ఈ సినిమా లో సల్మాన్ పాత్రపై కూడా ఇంట్రెస్టింగ్ సమాచారం ఈ సినిమాపై తెలుస్తుంది. ఈ సినిమాలో సల్మాన్ ఒక పవర్ ఫుల్ రా ఏజెంట్ గా గాని లేదా పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. సల్మాన్ కి వేసిన గెటప్ గాని తన లుక్ గాని చూస్తూనే అలానే కనిపిస్తుంది. మరి చూడాల్సిందే సల్మాన్ ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపిస్తారో అని. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.
https://twitter.com/jayam_mohanraja/status/1506977411606458368?s=20&t=eG5fcXv3Skwxm7yRgSGqWQ