‘RRR’ లో ఎన్టీఆర్ రోల్ ఎంతసేపో క్లారిటీ మీ కోసం.!

భారతదేశపు గర్వించదగ్గ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) కోసం అందరికీ తెలిసిందే. ఇద్దరు మాస్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో చేసిన ఈ సినిమా ఇప్పుడు ప్రమోషన్స్ స్టార్ట్ చేసుకొని కొత్త అప్డేట్స్ తో కూడా సిద్ధం అవుతుంది.

అయితే నిన్ననే రాజమౌళి ఓ మీట్ కి అటెండ్ అవ్వగా అక్కడ చాలా ఆసక్తికర విషయాలు తెలియజేయడం జరిగింది. అయితే ఈ టైం లోనే అసలు ఎన్టీఆర్ ఈ చిత్రంలో ఎంతసేపు కనబడతాడో క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ జస్ట్ 30 నిముషాలు మాత్రమే నిలబడే పాత్ర అయితే కాదని క్లారిటీ ఇచ్చారు.

దీనిని బట్టి సినిమాలో ఎన్టీఆర్ రోల్ ఎంతసేపు ఉంటుందో మీరే అర్ధం చేసుకోవచ్చని తెలిపారు. ఇంకా అసలు అంత తక్కువసేపు ఎన్టీఆర్ కనబడితే ఫ్యాన్స్ ఊరుకుంటారా అని రాజమౌళి ప్రశ్నించారు. సో ఈ చిత్రంలో ఎన్టీఆర్ రోల్ అంత చిన్నది అయితే కాదని చెప్పాలి.